ధనుష్ విఐపి-2

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ధనుష్ కధానాయకుడుగా వి క్రియేషన్స్, వండర్ బార్ పతాకాలపై సౌందర్య రజనీకాంత్ దర్శకత్వంలో కలైపులి థాను, ధనుష్ రూపొందించిన చిత్రం విఐపి-2. కాజోల్ కథానాయికగా నటించిన ఈ చిత్రానికి సంబంధించిన పాత్రికేయుల సమావేశం హైదరాబాద్‌లో జరిగింది. ఈ సందర్భంగా దర్శకురాలు సౌందర్య రజనీకాంత్ మాట్లాడుతూ, తెలుగులో ధనుష్ నటించిన తొలి స్ట్రయిట్ చిత్రం ఇదని, తనపై నమ్మకంతోనే దర్శకురాలిగా ఎంచుకున్నాడని తెలిపారు. విఐపి-2 చిత్రం తెలుగులో తప్పక విజయవంతం అవుతుందని, విఐపి-1 చిత్రాన్ని రఘువరన్ బిటెక్‌గా విడుదల చేసామని, ఆ సినిమాకు సీక్వెల్‌గా ఇది వస్తుందని ధనుష్ తెలిపారు. తెలుగులో నటించడంవల్ల భాష గురించి కూడా తాను తెలుసుకున్నానని, షూటింగ్ వండర్‌ఫుల్ జర్నీలా సాగిందని, రఘువరన్ బిటెక్ లాగే ఈ చిత్రం కూడా వైవిధ్యభరితంగా వుంటుందని తెలిపారు. తన కిష్టమైన హైదరాబాద్‌లో ఈ కార్యక్రమంలో పాల్గొనడం ఆనందంగా వుందని గతంలో అనేకసార్లు షూటింగ్‌లకు ఇక్కడికి వచ్చానని నటి కాజోల్ తెలిపారు. హిందీలో కాకుండా వేరే భాషలో నటించి చాలా కాలం అయిందని, సౌందర్య, ధనుష్‌ల వల్లనే ఈ చిత్రంలో తాను నటించానని ఆమె అన్నారు. కార్యకమంలో సినిమా యూనిట్ పాల్గొని విశేషాలను తెలిపారు. ఆమలాపాల్, రీతువర్మ, సముద్రఖని, శరణ్య పొన్‌వన్నన్ తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం: సియాల్ ఓడాన్, కెమెరా: సమీర్ తాహెర్, ఎడిటింగ్: ప్రసన్న జి.కె., కథ, మాటలు: ధనుష్, నిర్మాతలు: కలైపులి థాను, ధనుష్, దర్శకత్వం: సౌందర్య రజనీకాంత్.

చిత్రం..కాజోల్