ఇదేం దెయ్యం ఆడియో విడుదల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మాగంటి శ్రీనాధ్, సాక్షి కట్కర్, రచనా స్మిత్, రుచి పాండే ప్రధాన తారాగణంగా ఎవి రమణమూర్తి సమర్పణలో చిన్మయానంద ఫిలింస్ పతాకంపై వి.రవివర్మ దర్శకత్వంలో ఎస్.సరిత రూపొందిస్తున్న చిత్రం ఇదేం దెయ్యం. ఈ చిత్రానికి సంబంధించిన అన్ని కార్యక్రమాలు పూర్తి చేసారు. సినిమా ఆడి యో విడుదల కార్యక్రమం హైదరాబాద్ ప్రసాద్ లాబ్‌లో నిర్వహించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన ప్రతాని రామకృష్ణగౌడ్ తొలి సిడినిన విడుదల చేసి యూనిట్ సభ్యులకు అందించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రస్తుతం హారర్ చిత్రాల హవా సాగుతోందని, కమర్షియల్ పాయింట్‌ను ఎలివేట్ చేస్తూ ఈ సినిమా హారర్ కామెడీగా తెరకెక్కించినట్టుగా కనిపిస్తోందని తెలిపారు. విజువల్స్, పాటలు బాగున్నాయని, సినిమా మంచి విజయం సాధించాలన్నారు. దర్శకుడు మంచి కథను ఎంపిక చేసుకున్నారని, హాస్యానికి హారర్‌ను జోడించి వైవిధ్యంగా తెరకెక్కించారని డిఎస్ రావు అన్నారు. రచ్చ రవి, ఆర్‌పి, తాను కలిసి చేసిన సన్నివేశాలు కడుపుబ్బ నవ్విస్తాయని, క్లాస్ మాస్ ఆడియన్స్‌కు నచ్చుతుందని కథానాయకుడు శ్రీనాధ్ మాగంటి తెలిపారు. రచ్చరవి, ఆర్‌పి, శ్రీనాధ్‌లను దృష్టిలో పెట్టుకుని ఈ కథను తాను రాసుకున్నానని, రాసుకున్నదానికన్నా సినిమా అద్భుతంగా వచ్చిందని కామెడీ హైలెట్‌గా సాగే ఈ చిత్రంలో హారర్ సన్నివేశాలు ప్రేక్షకులకు థ్రిల్ కలిగిస్తాయని దర్శకుడు రవివర్మ అన్నారు. ఈ సినిమా తన కెరీర్‌లో వైవిధ్యమైనదని తన పాత్ర అందరికీ నచ్చుతుందుని కథానాయిక సాక్షి కట్కర్ అన్నారు. రచనా స్మిత్, రిచాపాండే, బాలుస్వామి తదితరులు చిత్ర విశేషాలను తెలిపారు. కార్యక్రమంలో సాగర్, తుమ్మలపల్లి రామసత్యనారాయణ, తదితరులు పాల్గొని విశేషాలు తెలిపారు. జీవా, గొతంరాజు, అప్పారావు, హర్షిత్ సాయి తదితరులు నటించిన ఈ చిత్రానికి కెమెరా: కృష్ణప్రసాద్, పాటలు: సాయికుమార్, రీరికార్డింగ్: ఏలేందర్, నిర్మాత: ఎస్.సరిత, దర్శకత్వం: వి.రవివర్మ.