మెగాస్టార్ టైటిల్‌తో

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హీరో సాయిధరమ్ తేజ్ బివిఎస్ రవి దర్శకత్వంలో జవాన్ సినిమా చేస్తూనే మరో కొత్త సినిమాపై ఫోకస్ పెట్టాడు. అది కూడా యూత్ పల్స్ తెలిసిన డైరక్టర్ మారుతి దర్శకత్వంలో కావడం విశేషం. ఫిలింనగర్ సమాచారం ప్రకారం ప్రస్తుతం చర్చల దశలో వున్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాదిలో పట్టాలెక్కించే చాన్స్ ఉందట. ఇక ఈ ప్రాజెక్టులో అసలు విశేషమేమంటే దీనికి మెగాస్టార్ చిరంజీవి సూపర్ హిట్ చిత్రం ‘మహానగరంలో మాయగాడు’ టైటిల్‌ను పెట్టాలని యోచన జరుగుతోందట. ఇప్పటికే పలుసార్లు తన మేనమామ ‘మెగాస్టార్’ పాటల్ని తన సినిమాల్లో రీమిక్స్ చేసి అభిమానుల ఆదరణను చూరగొన్న ధరమ్‌తేజ్ ఈ టైటిల్‌ను తన సినిమాకి పెట్టుకుంటాడో లేదో కచ్చితంగా తెలియాలంటే కొన్నాళ్లు ఆగాలి. సాయిధరమ్ నటించిన ‘నక్షత్రం’ ఆగస్టు 4న విడుదలవుతుండగా వివి వినాయక్, కరుణాకరన్ వంటి దర్శకులతో సినిమాలు చేయనున్నాడు.