చరణ్‌కు జోడీగా..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎన్నో ఆశలు పెట్టుకున్న ‘బ్రూస్‌లీ’ చిత్రం అనుకున్న విజయం సాధించకపోవడంతో ఈసారి ఎలాగైనా హిట్ కొట్టాలనే కసితో వున్నాడు రామ్‌చరణ్. తమిళంలో సూపర్‌హిట్ అయిన ‘తనిఒరువన్’ చిత్రానికి రీమేక్‌గా రూపొందే చిత్రంలో నటిస్తున్నాడు. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కే ఈ చిత్రం ఈనెల రెండవ వారంలో ప్రారంభం కానుంది. ఈ చిత్రంలో ఇప్పటివరకు హీరోయిన్ ఓకె కాలేదు. తాజా సమాచారం ప్రకారం ఇందులో హీరోయిన్‌గా గ్లామర్ భామ ఇలియానాను నటింపజేయాలని దర్శకుడు సురేందర్ రెడ్డి ప్రయత్నిస్తున్నారు. అయితే ప్రస్తుతం ఫామ్‌లోలేని ఇలియానా కాకుండా వేరే హీరోయిన్‌తో చేయాలని చరణ్ భావిస్తున్నాడని తెలిసింది. అయితే ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా పూర్తికావచ్చిన ఈ సినిమాలో నటించేందుకు ఇలియానా సైతం తెగ ఆసక్తి కనబరుస్తోంది. మొత్తానికి ఫైనల్‌గా ఇల్లి భామ చరణ్‌తో జోడీ కట్టేందుకు సై అంటోంది. ఈ చిత్రానికి ‘రక్షక్’ అనే టైటిల్ పెడుతున్నట్టు తెలిసింది.