దర్శకుడిగా అరవింద్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రస్తుతం సెకెండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టి విలన్‌గా పలు చిత్రాల్లో నటిస్తూ క్రేజ్ తెచ్చుకుంటున్నాడు అరవింద్ స్వామి. ఆ మధ్య ఆయన ధృవ చిత్రంలో కొత్త తరహా విలనిజాన్ని ప్రదర్శించి ఆకట్టుకున్నాడు. తమిళంలో పలు చిత్రాల్లో నటిస్తున్న ఆయన త్వరలోనే దర్శకుడిగా మారుతున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్‌తోపాటు ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయట. ఈ చిత్రాన్ని మణిరత్నం నిర్మిస్తుండడం విశేషం. రోజా సినిమాతో అరవింద్ స్వామిని హీరోగా పరిచయం చేశాడు మణిరత్నం. తొలి చిత్రంతో జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు తెచ్చుకున్న అరవింద్‌స్వామి తక్కువ సినిమాల్లోనే నటించాడు. త్వరలోనే ఈ సినిమా సెట్స్‌పైకి వచ్చే అవకాశాలున్నాయి.