వర్మ గవర్నమెంట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దర్శకుడు వర్మ ఎప్పుడూ ఏదో సంచలనంతో వార్తల్లో నిలుస్తుంటాడు. ఇటీవలే విజయవాడ బ్యాక్‌డ్రాప్‌లో వంగవీటి మోహనరంగ జీవిత చరిత్రను తెరకెక్కిస్తానంటూ ప్రకటించిన వర్మ ఇపుడు మరో సంచలనానికి తెరలేపాడు. తాజాగా ‘కిల్లింగ్ వీరప్పన్’ సినిమాతో మళ్లీ ఫామ్‌లోకి వచ్చిన వర్మ ఈసారి దావూద్ ఇబ్రహీం, చోటారాజన్ జీవితంపై ఒక చిత్రాన్ని తెరకెక్కిస్తాడని అంటున్నాడు. దీనికి టైటిల్ కూడా ఫిక్స్ చేశాడు. ‘గవర్నమెంట్’ పేరుతో ఈ చిత్రం తెరకెక్కుతుందని, వాస్తవాలకు దగ్గరగా వుంటుందని అంటున్నాడు వర్మ. మాఫియా ప్రపంచాన్ని గడగడలాడించిన దావూద్ ఇబ్రహీం జీవితంపై సినిమా తీస్తే పరిణామాలు ఎలా వుంటాయోనని అనుకుంటున్నారు.