సందీప్‌తో గౌతమ్ మీనన్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దర్శకుడు గౌతమ్ మీనన్ నిర్మాతగానూ వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం తమిళ యువ దర్శకుడు డి-16 ఫేమ్ కార్తీక్ నరేన్ దర్శకుడిగా ‘నరగసూరన్’ అనే చిత్రాన్ని గౌతమ్ నిర్మిస్తున్నాడు. ఇందులో యంగ్ హీరో సందీప్ కిషన్ కూడా నటిస్తున్నారు. ఇటీవలే తమిళంలో ‘మానగరం’ తెలుగులో ‘శమంతకమణి’ వంటి చిత్రాల్లో సందీప్‌కిషన్ చేసిన భిన్నమైన రోల్స్‌పట్ల ఇంప్రెస్ అయిన గౌతమ్ మీనన్ అతనితో ఒక ప్రాజెక్టు చేయాలనే ఆలోచనలో ఉన్నాడట. ప్రస్తుతం చర్చల దశలోవున్న ఈ సినిమా ఖచ్చితంగా తెలుగు, తమిళ ద్విభాషా చిత్రంగా ఉంటుందని తెలుస్తోంది. భిన్నమైన రోల్స్ ఎంచుకుంటూ తెలుగు, తమిళ పరిశ్రమల్లో తనకంటూ ప్రత్యేకత సొంతం చేసుకున్న సందీప్ కిషన్‌కు గౌతమ్ మీనన్‌తో చేయబోయే ఈ సినిమా కెరీర్ పరంగా బాగా ఉపయోగపడే అవకాశముంది. ఇకపోతే ఈ యువ హీరో తమిళ దర్శకుడు తిరు డైరెక్షన్‌లో కూడా ద్విభాషా చిత్రానికి సైన్ చేశాడని వినికిడి.