భారీ విజువల్ ఎఫెక్ట్‌తో..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చాలాకాలం క్రితం వచ్చిన వెంకటేష్ బొబ్బిలిరాజా సినిమా గుర్తుందిగా. ‘అయ్యో అయ్యో అయ్యయో’ అన్న మేనరిజంతో అప్పట్లో వెంకటేష్ బాగా ఆకట్టుకున్నాడు. ఆ చిత్రంలో ‘కన్యాకుమారీ.. కనబడదా దారి’ అంటూ ఓ హిట్టు సాంగు కూడా ఉంది. ఆ పాట ప్రత్యేకత -అప్పట్లో వేళ్లూనుకుంటున్న గ్రాఫిక్స్. ఇప్పుడు అప్‌డేట్ గ్రాఫిక్స్‌తో పూర్తి సినిమాయే చేయబోతున్నాడు వెంకటేష్. కథల ఎంపిక విషయంలో చాలా కేర్ తీసుకునే వెంకటేష్ -గురుతో మంచి హిట్టందుకుని ఇప్పుడు కొత్త ప్రాజెక్టుతో రాబోతున్నాడు. నిజానికి గురు తరువాత గ్యాప్ తీసుకోవానికి కారణం -సరైన కథకోసమేనట. నచ్చిన కథ దొరకటంతో కొత్త ప్రయోగానికి ప్రయత్నాలు మొదలెట్టాడు.
కొత్త ప్రాజెక్టులో గ్రాఫిక్స్ ప్రధాన ఆకర్షణగా నిలుస్తుందని అంటున్నారు. జంతువుల నేపథ్యంలో సినిమా ఉంటుందని, భారీ బడ్జెట్‌తో నిర్మించనున్నట్టు చెబుతున్నారు. నూతన దర్శకుడు తెరకెక్కించే సినిమాకు సంబంధించ ప్రీ ప్రొడక్షన్ పనులు జోరుగా సాగుతున్నాయని, త్వరలోనే సెట్స్‌పైకి వెళ్లనున్నారని సమాచారం.