కర్నాటకకు లోకరక్షకుడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రీస్తు జీవిత కథ ఆధారంగా నిర్మిస్తోన్న లోకరక్షకుడు చిత్రం రెండు షెడ్యూల్స్ పూర్తి చేసుకుని, కర్నాటకలో మూడో షెడ్యూల్ మొదలబెట్టబోతోంది. చంద్రాస్ ఆర్ట్ మూవీస్ పతాకంపై చంద్రశేఖర్ రూపొందిస్తున్న చిత్రమే లోకరక్షకుడు. సిహెచ్ బ్రహ్మం దర్శకత్వంలో రూపొందిస్తున్న చిత్రం లండన్‌లో షూటింగ్ మొదలవ్వడం తెలిసిందే. పలు భాషల్లో, పలు దేశాల నటీనటులతో తెరకెక్కిస్తున్న చిత్రానికి సంబంధించిన లోగోను అక్కడి పార్లమెంట్‌లో కొద్దిరోజుల క్రితమే విడుదల చేశారు. తాజాగా మూడో షెడ్యూల్ మొదలవుతోన్న సందర్భంలో నిర్మాత చంద్రశేఖర్ మాట్లాడుతూ క్రీస్తు జీవిత చరిత్రను అత్యద్భుతంగా కొత్త అంశాలతో తెరకెక్కిస్తున్నట్టు చెప్పుకొచ్చారు. భారతదేశంలో గౌతమ బుద్ధుడు, మహాత్మగాంధీలాంటి మహామహులు ప్రపంచశాంతికి మార్గం చూపారని, అలాగే క్రీస్తు జీవితం ఏవిధంగా మానవాళికి సందేశాత్మకమైందో ప్రతి ఒక్కరికీ అర్థమయ్యే రీతిలో చూపించబోతున్నట్టు చెప్పారు. ప్రస్తుతం చెన్నైలో పాటల రికార్డింగ్ జరుగుతోందని, ఇప్పటివరకు రెండు షెడ్యూల్స్ పూర్తి చేశామన్నారు. మూడో షెడ్యూల్‌ను ఈనెలలోనే విదేశీ నటీనటులతో కర్నాటకలో మొదలుపెడుతున్నట్టు చెప్పారు. చిత్రానికి సంగీతం ఎకె రిసాల్‌సాయి, కెమెరా జి క్రిష్ అందిస్తున్నారు.