నా కెరీర్‌కు లై మైలురాయి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘హను రాఘవపూడి వైవిధ్యమైన స్క్రీన్‌ప్లే ‘లై’కి ఓ కొత్త ఇమేజ్ తెస్తుంది. అంతేకాదు, హను దర్శకత్వంలో నేను చేసిన సినిమా కెరీర్‌లో మెమరబుల్ మైల్‌స్టోన్ అవుతుందన్న నమ్మకం కలుగుతోంది’ అన్నాడు హీరో నితిన్. మేఘా ఆకాష్ కథానాయికగా 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనీల్ సుంకర సంయుక్తంగా రూపొందించిన ‘లై’ ఈనెల 11న విడుదలకు సిద్ధమైంది. ఈ సందర్భంగా హీరో నితిన్ చిత్ర విశేషాలు వెల్లడించారు.
గ్యాప్ నిజమే
అఆ తరువాత గ్యాప్ తీసుకున్న మాట నిజమే. అంత మంచి హిట్ తరువాత ఏ సినిమా చేయాలన్న డైలమాలో పడ్డా. త్రివిక్రమ్‌కు కాల్ చేశా. రెగ్యులర్ స్టోరీలు వదిలేసి, వైవిధ్యమైన కథను ఎంచుకోమని సలహా ఇచ్చారు. చాలా కథలు విన్నా. ఏదీ నచ్చలేదు. చివరికి హను అరగంటపాటు చెప్పిన కథ నచ్చడంలో ఫస్ట్ సిట్టింగ్‌లోనే సినిమా ఓకె అయింది.
లై అంటే?
రెగ్యులర్ సినిమాగా కాకుండా లవ్ ఎమోషన్ స్టైలిష్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందించారు. హీరో హీరోయిన్ల మధ్య వచ్చే లవ్ ట్రాక్ కొత్తగా ఉంటుంది. వారిమధ్య వచ్చే చిన్న చిన్న అబద్ధాలు ఆసక్తి కలిగిస్తాయి. ఆవారాగా తిరిగే కుర్రాడు యుఎస్ వెళ్లి డబ్బున్న అందమైన అమ్మాయిని పెళ్లాడి డాలర్స్ సంపాదించాలనుకుంటాడు. అక్కడికి వెళ్లాక ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాడు అనే అంశంతో థ్రిల్లింగ్‌గా సాగుతుంది.
ఇద్దరి పాత్రలు పోటీగా
శ్రీఆంజనేయం సినిమా తరువాత యాక్షన్ కింగ్ అర్జున్‌తో నటించడం చాలా హ్యాపీగా అనిపించింది. తొలిసారిగా ఆయన విలన్‌గా నటించారు. చాలా స్టైలిష్‌గా ఉంటుంది ఆయన పాత్ర. ఆయన లేకపోతే సినిమా ఇంత బాగా వచ్చేది కాదేమో. మా ఇద్దరిమధ్య జరిగే గేమ్ థ్రిల్లింగ్‌గా, ఎత్తుకు పైఎత్తులు వేసుకుంటూ పోటాపోటీగా సాగుతాయి. శ్రీఆంజనేయం సినిమా సమయంలో ఎలా ఉన్నారో ఇప్పటికీ ఆయన అలాగే ఉన్నారు. అర్జున్ ఎక్కడా డూప్‌లేకుండా రియలిస్టిక్‌గా చేశారు.
నిర్మాణ విలువలు..?
నా మార్కెట్‌ను దృష్టిలో పెట్టుకుని కథకోసం ఎంత ఖర్చుపెట్టాలో అంతే పెట్టారు. అయితే సినిమాని హాలీవుడ్ స్థాయిలో రూపొందించారు. ఎవరూ చేయని కాస్ట్‌లీ లొకేషన్స్‌లో షూటింగ్ చేశారు. క్లైమాక్స్‌లో వచ్చే ఫైట్స్ హైలెట్.
హిట్ ఫ్లాప్‌లు సహజం..
జయం, దిల్, సై లాంటి చిత్రాలతో వరుసగా హిట్లు అందుకున్నాను. ముందు నన్ను ప్రేక్షకులు హీరోగా ఒప్పుకున్నారు. తరువాత హిట్ ఫ్లాప్‌లు వచ్చాయి. ఎప్పుడూ మంచి సినిమాలు చేయాలనే ప్రయత్నిస్తాం. ఫస్ట్ నుంచీ యాక్టింగ్, డాన్స్, ఫైట్స్ బాగా చేయాలన్న కసి ఉండేది. ఒక్క సినిమా అయినా సరే ప్రేక్షకులకు నచ్చేలా ఉండాలన్న పక్కా ప్లానింగ్‌తో చేస్తా. ఏ సినిమా అయినా ఇష్టపడి, కష్టపడి చేస్తా. ఫ్లాప్‌లు హిట్‌లు అనేవి ప్రేక్షకుల చేతిలో ఉంటాయి. అవి సహజంగానే ఎదురౌతాయి.. అంతే.
స్క్రీన్‌పై హను కథ?
హను కథ చెప్పినప్పుడు ఎలా ఫీల్ అయ్యానో సినిమా చూసినపుడు కూడా అదే ఫీల్ వచ్చింది. చెప్పినదానికన్నా వందశాతం స్ట్రాంగ్‌గా తీశాడు. ఒక ఎమోషన్‌తో మంచి స్టైలిష్ సినిమా చూశాననిపించింది. సినిమాలో కామెడీకి అంటూ సెపరేట్ ట్రాక్ ఏమీ లేదు. కథలో భాగంగానే ఉంటుంది.
పవన్ అనుకరణా?
తమ్ముడు సినిమాలో లుంగీ కట్టుకుని బీడీ కాల్చే డాన్స్ సీన్‌ని ఈ చిత్రంలో ఉపయోగించాం. చాలామంది పవన్‌కళ్యాణ్ సినిమాలు బాగా వాడుకుంటున్నావ్ అని అడిగారు. నేను ఆయన సినిమాలు చూస్తూ పెరిగా. నా లైఫ్‌లో చేసే ప్రతి సినిమాలో ఆయన చేసిన సీన్ ఏదో ఒకటి ఉపయోగిస్తా. ఎందుకంటే ఆయనంటే నాకంత ఇష్టం.
నెక్స్ట్ మూవీస్?
ప్రస్తుతం పవన్‌కళ్యాణ్- త్రివిక్రమ్ నిర్మించే సినిమా చేస్తున్నా. మరికొన్ని కథలు వింటున్నా. అన్నీ చర్చల దశలోనే ఉన్నాయి.

-యు