సంఘమిత్ర కాదట!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దర్శకుడు సుందర్.సి అత్యం త భారీ బడ్జెట్‌తో నిర్మించ తలపెట్టిన ‘సంఘమిత్ర’ చిత్రానికి ఊహించని అడ్డంకి వచ్చిపడిన సంగతి తెలిసిందే. ముందునుండి అనుకున్నట్టు సినిమాలో శృతిహాసన్ నటించడం లేదని కొన్ని నెలల క్రితమే తేలిపోయింది. అప్పటినుండి ఆమె స్థానంలో ఎవరెవరో హీరోయిన్లు పేర్లు వినిపించినా హన్సిక పేరు మాత్రం బలంగా వినబడింది. దీంతో అంతా ఆమె కన్‌ఫర్మ్ అనుకున్నారు. కానీ తాజా సమాచారం ప్రకారం ఆమె ఈ సినిమాలో నటించడం లేదని ఖచ్చితంగా తేలిపోయింది. హన్సిక సన్నిహిత వర్గాలు, సంఘమిత్ర ప్రాజెక్టుకు సంబంధింన వ్యక్తుల ద్వారా విషయం బయటికొచ్చింది. దీంతో బాహుబలికి సమానమైన ప్రాజక్టు అని ప్రచారంలో ఉన్న సినిమాలో మెయిన్ లీడ్ ఎవరు చేస్తారనేదానిపై సస్పెన్స్ ఇంకా అలానే ఉంది. కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో లాంఛ్ జరుపుకున్న చిత్రాల్లో జయం రవి, ఆర్యలు పలు కీలక పాత్రలు చేస్తుండగా ఎఆర్ రెహమాన్ సంగీతం అందించనున్నారు.