దేశభక్తిని రేపే మనసైనోడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మనోజ్ నందం, ప్రియాసింగ్ జంటగా హెచ్ పిక్చర్స్ పతాకంపై హసీబుద్ధిన్ నేతృత్వంలో సత్యవరపు వెంకటేశ్వరరావు నేతృత్వంలో రూపొందించిన చిత్రం 3మనసైనోడు2. ఈ చిత్రానికి సంబంధించిన ఆడియో విడుదల హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్‌లో నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న గోపీనాథ్‌రెడ్డి సీడీల ను విడుదల చేసి యూనిట్‌కు అందించారు. ట్రైలర్‌లను కొండేటి సురేష్ విడుదల చేశారు. ఈ సందర్భంగా నిర్మాత హసీబుద్ధిన్ మాట్లాడుతూ తాను విదేశాల్లో వున్నా స్వదేశం కోసం ఏదో ఒకటి చేయాలని ప్రయత్నిస్తుంటానని, ఈ చిత్రంలో భారతదేశం చాలా గొప్పదన్న పాయింట్‌ను చర్చించామని, చిత్రం అందరికీ నచ్చుతుందని అన్నారు. ఆరు పాటలకు మంచి బాణీలు కుదిరాయని, జయ జయ జయహే భారతావని సద్గుణ సమోపేత2అంటూ భారతదేశ గొప్పతనాన్ని ప్రతి భారతీయుడు గర్వంగా తలెత్తుకుని పాడుకునేలా ఓ దేశభక్తి గీతాన్ని స్వర్గీయ సినారె అందించారని, ఇది ఈ చిత్రానికే హైలెట్ అవుతుందని దర్శకుడు వెంకటేశ్వరరావు అన్నారు. మగవాళ్ల జీవితాల్లో ఆడవాళ్లు లేకపోతే ఎంత నష్టమో కాస్త చిలిపిగా ఓ పాట ఉందని, అలాగే కుటుంబ కథలో ప్రేమకథను జోడించి దేశానికి సందేశమిచ్చేలా చిత్రాన్ని రూపొందించామని అన్నారు. కార్యక్రమంలో చిత్ర యూనిట్ పాల్గొని విశేషాలను తెలిపారు. పోసాని కృష్ణమురళి, గిరిబాబు, రఘుబాబు, కేదార్ శంకర్, సంగీత, మధుమణి, జ్యోతి తదితరులు నటించిన చిత్రానికి కెమెరా టి సురేందర్‌రెడ్డి, ఎడిటింగ్ మార్తాండ్ కె వెంకటేష్, పాటలు డా. సి నారాయణరెడ్డి, భాస్కరభట్ల, గోశాల రాంబాబు, పూర్ణాచారి, సంగీతం సుభాష్ ఆనంద్, నిర్మాత హసీబుద్దిన్, కథ, మాటలు, దర్శకత్వం సత్యవరపు వెంకటేశ్వరరావు.