పాటల్లో ‘ఓయ్ నినే్న’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భరత్, సృష్టి జంటగా సత్య చల్లకోటి దర్శకత్వంలో ఎస్‌వికె సినిమా పతాకంపై వంశీకృష్ణ శ్రీనివాస్ నిర్మిస్తున్న చిత్రం ‘ఓయ్ నినే్న’. శేఖర్ చంద్ర సంగీతం అందించిన ఈ సినిమాలోని పాటలు హైదరాబాద్‌లో విడుదల చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ హాజరయ్యారు. ఏపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి, అనిల్ రావిపూడి, చంద్రసిద్ధార్థ్, కోన వెంకట్ తదితరులు కార్యక్రమానికి హాజరయ్యారు. కోన వెంకట్ సిడీని విడుదల చేశారు. అనంతరం మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ తెలుగు పరిశ్రమ ఎంతో వేగంగా అభివృద్ధి చెందుతోంది. ఈ తరుణంలో కొత్త నటీనటులు రావాల్సిన అవసరం ఎంతైనా వుంది. వైవిధ్యంతో వస్తున్న చిత్రాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. పరిశ్రమ అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం ఎంతో తోడ్పడుతోంది అన్నారు. కోన వెంకట్ మాట్లాడుతూ మంచి సినిమా తీయడానికి మంచి కథ, దానికి తగ్గ నటీనటులు ఉండాలి. అలా నమ్మే నిర్మాత వంశీ కృష్ణ. ఇందులోని పాటలు బాగున్నాయి, దర్శకుడు సత్య చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కించారు అన్నారు. తప్పకుండా సినిమా మంచి విజయం సాధిస్తుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. నిర్మాత వంశీకృష్ణ మాట్లాడుతూ ‘నా బ్యానర్‌లో చేసిన సినిమాల్లో సోలో నాకు బాగా నచ్చింది. అప్పటిదాకా ఆ రేంజ్‌లో తెరకెక్కిన చిత్రమిది. కొత్తవారితో చేసిన ఈ ప్రయత్నం తప్పకుండా ప్రేక్షకులకు నచ్చుతుందన్న నమ్మకం ఉంది అన్నారు. దర్శకుడు సత్య మాట్లాడుతూ నిర్మాత నన్ను నమ్మి సినిమా ఇచ్చారు. ఆయన సహకారంతో సినిమాను ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా తెరకెక్కించాం అన్నారు.