ముందే వస్తాడా!?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రామ్‌చరణ్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న రంగస్థలం 1985 చిత్రం హైదరాబాద్‌లో వేసిన భారీ విలేజ్ సెట్‌లో షూటింగ్ జరుపుకుంటోంది. 1985 కాలంనాటి పరిస్థితులకు అద్దం పడుతూ తెరకెక్కుతున్న సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. సుకుమార్ మేకింగ్ స్టైల్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమాను వచ్చే సంక్రాంతి కానుకగా విడుదల చేస్తారని ప్రకటించిన విషయం తెలిసిందే. కానీ సినిమా అనుకున్న డేట్‌కంటే ముందుగానే విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. దానికి కారణం ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం త్వరలోనే పూర్తయ్యేలా ఉంది. దాంతో సినిమా పూర్తి చేసిన తరువాత ఎక్కువ గ్యాప్ ఎందుకనే ఉద్దేశంతో డిసెంబర్ చివరిలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి. ఈ సినిమా ముందే విడుదలవుతుందని తెలియడంతో మెగా ఫాన్స్ ఆనందంలో ఉన్నారట. మైత్రీ మూవీస్ పతాకంపై తెరకెక్కుతున్న ఈ చిత్రంలో సమంత హీరోయిన్‌గా నటిస్తోంది. మరి ఈ చిత్రం అనుకున్న డేట్ కంటే ముందే విడుదల చేస్తారా? లేదా సంక్రాంతికే వస్తుందా అన్నది తెలియాల్సి ఉంది.