బోయపాటితో చిరు152

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖైదీనెంబర్ 150 సినిమాతో మంచి విజయాన్ని అందుకుని తన హవా తగ్గలేదని ప్రూవ్ చేసుకున్నాడు మెగాస్టార్ చిరంజీవి. ప్రస్తుతం ఈయన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కథతో తెరకెక్కే చిత్రంలో నటించనున్నాడు. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ చిత్రానికి సురేందర్‌రెడ్డి దర్శకత్వం వహించనున్నాడు. ఇక ఈ సినిమా తరువాత చిరంజీవి 152 సినిమా కూడా సన్నాహాలు మొదలయ్యాయి. బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కనుందని ఇటీవల బోయపాటి శ్రీను ఒక ఇంటర్వ్యూలో తెలిపారు. ప్రస్తుతం ఆయన రూపొందించిన జయ జానకీ నాయక సినిమా విడుదలైన సందర్భంగా చిరంజీవి బోయపాటికి ఫోన్ చేసి అభినందించాడట. చిరంజీవినుండి ఫోన్ రావడంతో బోయపాటి ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బయ్యాడట. ఉయ్యాలవాడ సినిమా తరువాత బోయపాటి చిరంజీవి కోసం ఒక పవర్‌ఫుల్ స్క్రిప్ట్‌ను సిద్ధం చేసాడని తెలిసింది. వీరిద్దరి కాంబినేషన్‌లో రూపొందే సినిమాకు సమయం పడుతుంది కాబట్టి ఈలోగా బోయపాటి మరో హీరోతో సినిమా చేస్తాడని టాక్.