పుట్టిన రోజునే ఫస్ట్‌లుక్?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్ హీరోగా నటిస్తున్న 25వ సినిమా ఫస్ట్‌లుక్ కోసం ఆత్రంగా ఎదురు చూస్తున్నారు మెగా ఫ్యాన్స్. క్రేజీ దర్శకుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా మొదలై చాలా రోజులే అవుతున్నా ఇంకా టైటిల్‌కానీ, ఫస్ట్‌లుక్‌కానీ విడుదల చేయలేదు. దాంతో మెగా ఫ్యాన్స్‌లో నిరాశ మొదలైంది. ఈ సినిమా ఫస్ట్‌లుక్ ఎప్పుడంటూ అందరూ ప్రశ్నిస్తున్నారు. దాంతో ఫ్యాన్స్‌ను హర్ట్ చేయకుండా ఉండేందుకు పవన్ ఓ నిర్ణయం తీసుకున్నాడట. త్వరలోనే సినిమా టైటిల్‌తో కూడిన ఫస్ట్‌లుక్‌ని విడుదల చేయాలని నిర్ణయించారట. అయితే ఆ ఫస్ట్‌లుక్ వచ్చేది ఎప్పుడో తెలుసా..? సెప్టెంబర్ 25న. అంటే -పవన్ పుట్టినరోజు సందర్భంగా ఫస్ట్‌లుక్‌ని విడుదల చేయనున్నారన్న మాట. ప్రస్తుతం మరో షెడ్యూల్‌ని విదేశాల్లో జరుపుకుంటున్న ఈ సినిమాలో కీర్తి సురేష్, అను ఇమాన్యుయేల్ హీరోయిన్లు. ఇంజినీర్‌బాబు అనే టైటిల్ ప్రచారంలో ఉన్న సమయంలో, అదే ప్రకటిస్తారో, కొత్త టైటిల్ పోస్టర్ మీదకు తెస్తారో చూడాలి.