లండన్ బాబులు పాట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రక్షిత్, స్వాతి జంటగా మారుతి టాకీస్ పతాకంపై చిన్నికృష్ణ దర్శకత్వంలో మారుతి రూపొందించిన చిత్రం లండన్ బాబులు. ఈ సినిమాలో ఓ పాటను దర్శకుడు హరీశ్ శంకర్ విడుదల చేశారు. తమ్మారెడ్డి భరద్వాజ స్పెషల్ టీజర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా హరీశ్ శంకర్ మాట్లాడుతూ- ఈ టీజర్, పాట చూస్తుంటే తాను నాటకాల్లో పనిచేసిన రోజులు గుర్తుకొచ్చాయని, స్వాతి నటించింది అంటే ఆ సినిమా కథ బాగుంటుందనే అనుకుంటామని, ఈ సినిమా విజయవంతం కావాలని కోరుకున్నారు. వచ్చే నెల మొదటివారంలో సినిమాను విడుదల చేస్తున్నామని, కె అందించిన మ్యూజిక్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాకు హైలెట్‌గా వుంటుందని, పాస్‌పోర్ట్ కోసం పడే తిప్పలను ఈ సినిమాలో చర్చించామని, రెగ్యులర్ సినిమాలా కాకుండా సరికొత్తగా వుంటుందని మారుతి తెలిపారు. లండన్ వెళ్లాలనుకున్న ఓ యువకుడి కథనంతో వినోదాత్మకంగా ఈ చిత్రాన్ని రూపొందించామని దర్శకుడు చిన్నికృష్ణ తెలిపారు.