ప్రేమ, ప్రియురాలు కఠినమే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

థర్డ్ ఐ క్రియేషన్స్ పతాకంపై గోవర్థన్.జి స్వీయ దర్శకత్వంలో రఘురామ్ రొయ్యూరుతో కలిసి రూపొందిస్తున్న చిత్రం 3ప్రేమ ఎంత మధురం ప్రియురాలు అంత కఠినం2. చంద్రకాంత్, రాధికా మెహరోత్రా జంటగా నటిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన మోషన్ పోస్టర్‌ను నిర్మాత బెక్కం వేణుగోపాల్ హైదరాబాద్‌లో విడుదలచేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ- అధిక భాగం అమెరికాలో షూటింగ్ చేసిన ఈ చిత్రం వైవిధ్యమైన కథనంతో రూపొందిందని, అమెరికాలో నటన, శిక్షణ పొందినవారితోనే రూపొందించారని, సినిమాపై పాషన్‌తో అమెరికా ఉద్యోగం వదులుకొని రూపొందించిన ఈ చిత్రం అందరికీ నచ్చుతుందని తెలిపారు. థ్రిల్లర్ ఎలిమెంట్ జోడించి రూపొందించిన బ్యూటిఫుల్ లవ్‌స్టోరీ మంచి హిట్ అవుతుందన్న నమ్మకం ఉందని ఆయన అన్నారు. అన్ని వర్గాల ప్రేక్షకులకి నచ్చుతుందన్న నమ్మకం ఉందని దర్శక నిర్మాత జి.గోవర్థన్ తెలిపారు. తొలి సినిమా అయినా తమకు మంచి బ్రేక్ ఇస్తుందన్న నమ్మకం ఉందని హీరో హీరోయిన్లు తెలిపారు. తనికెళ్ల భరణి, తులసి, జెమిని సురేష్, పల్లవి డోరా తదితరులు నటించిన ఈ చిత్రానికి పాటలు:కిట్టు విస్సాప్రగడ, ఎడిటింగ్:శ్రీనివాస్ తోట, సంగీతం:జితిన్ రోషన్, కెమెరా:మనోజ్‌రెడ్డి, నిర్మాతలు:రఘురామ్ గోవర్థన్.జి.