షాలినికి ప్లాటినమ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆమోఘ్ దేశ్‌పతి, అర్చన, శ్రేయా వ్యాస్ ప్రధాన తారాగణంగా స్వర్ణ ప్రొడక్షన్స్ పతాకంపై పార్సిల్ ఫేం షెరాజ్ దర్శకత్వంలో టివి సత్యనారాయణ రూపొందించిన చిత్రం షాలిని. ఈ చిత్రానికి సంబంధించిన పాటలు ఇటీవల శివరంజని మ్యూజిక్ ద్వారా విడుదలై మంచి స్పందన పొందిన నేపథ్యంలో ప్లాటినమ్ డిస్క్ వేడుకను జరిపారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా పాల్గొన్న రామకృష్ణగౌడ్ మాట్లాడుతూ- హార ర్ థ్రిల్లర్ నేపథ్యంలో లవ్ ఎంటర్‌టైన్‌మెంట్‌గా రూపొందించిన ఈ చిత్రానికి సంబంధించిన మేకింగ్ తాను చూశానని, చిన్న సినిమా అయినా పెద్ద చిత్రంలా రూపొందించారని తెలిపారు. మంచి కథతో రూపొందించిన ఈ సినిమా అందరికీ నచ్చుతుందని నటి కవిత అన్నారు. సెన్సార్ పూర్తిచేసుకున్న ఈ చిత్రానికి ఎ సర్ట్ఫికెట్ లభించిందని, హారర్ జోనర్ ఇష్టపడేవాళ్లకి ఈ చిత్రం తప్పక నచ్చుతుందని దర్శకుడు షెరాజ్ అన్నారు. డిఫరెంట్ మూవీస్ ఇష్టపడేవాళ్ళకి ఈ సినిమా సంతృప్తినిస్తుందని సాయి వెంకట్ తెలిపారు. కార్యక్రమంలో ఆమోఘ్ దేశపతి, మోహన్ గౌడ్, అట్లూరి రామకృష్ణ, ఎవివి సురేష్ తదితరులు పాల్గొని విశేషాలు తెలిపారు. అనంతరం ప్లాటినమ్ డిస్క్ జ్ఞాపికలను ప్రతాని రామకృష్ణగౌడ్, కవిత యూనిట్ సభ్యులకు అందజేశారు.