నాకు రాజకీయాలు సెట్ కావు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సినిమా సక్సెస్ వన్‌మ్యాన్ షో అంటే ఏకీభవించను. అలా ఎవరైనా నమ్మేవాళ్లుంటే పిచ్చివాళ్లకిందే లెక్క. ఎందుకంటే సినిమా ఏ ఒక్కరి కష్టం కాదు2 అంటున్నాడు లై విలన్ అర్జున్. ప్రయోగాత్మకంగా లై చిత్రంలో నెగెటివ్ రోల్ పోషించిన అర్జున్, ఆ పాత్ర చేయడానికిగల కారణాలను మీడియాతో పంచుకున్నాడు. 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై నితిన్, మేఘా ఆకాష్ జంటగా దర్శకుడు హను రాఘవపూడి రూపొందించిన చిత్రం లై. గతవారం చిత్రం విడుదలైన నేపథ్యంలో అర్జున్ మీడియాతో మాట్లాడాడు.

కొత్తదనం కోసమే..
ఏదైనా కొత్త పాత్ర దొరికితేనే -నటుడిగా నవ్యతను చూపించే అవకాశం ఉంటుంది. ఇప్పటికే 150 చిత్రాల్లో హీరోగా చేశా. ఆ మొనాటినీ నుంచి ఏదైనా కొత్తగా చేయాలనిపించింది. అందుకు -ఇదే సమయం అనిపించింది కూడా. అలా చేసిన చిత్రమే 3లై2. హీరోగానూ సినిమాలు వస్తున్నాయి, చేస్తున్నా. అల్లు అర్జున్ ఫ్యూచర్ ప్రాజెక్టులో వైవిధ్యమైన పాత్ర ఒకటి చేస్తున్నా. దేవుడు అవకాశం ఇచ్చినపుడే -దాన్ని సమర్థంగా ఉపయోగించుకోవాలన్నది నా పాలసీ.

కొత్త అనుభూతి..
లై సినిమాలో నటించడం ఓ కొత్త ఎక్స్‌పీరియెనే్స. హను రాఘవపూడి చెప్పిన కథ నచ్చింది. కానీ విలన్‌గా చేయడమంటే -నేను ప్రస్తుతం చేస్తున్న ఎన్నో సినిమాలతో ముడిపడి ఉంటుంది. ఒక పాత్ర -్భవిష్యత్ చిత్రాలపై ప్రభావం చూపించే ప్రమాదం ఉండొచ్చు. సినిమాను బిజినెస్ యాంగిల్‌లోనూ ఆలోచించాలిగా. నిజానికి కథ వినగానే నటుడిగా మంచి డైమన్షన్ ఉందనిపించింది. ఈ రెండింటి మధ్య అనేక తర్జనభర్జనలు పడి -పాత్ర చేయడానికే నిర్ణయించుకున్నా. నితిన్‌తో ఆల్రెడీ నటించాను. నటుడిగా హార్డ్‌వర్కర్. తనంటే ఇష్టం కూడా. ఆ కోణంలోనూ ఈ పాత్ర ఒప్పుకోక తప్పలేదు. హీరోగా నటించినప్పుడు అందరి నుంచీ లభించిన ప్రశంసలే లై చిత్రంలోని పాత్రకూ లభించడం సంతృప్తినిస్తుంది.

వన్ మేన్ షో కాదు..
సినిమా సక్సెస్ వన్ మ్యాన్ షో కాదు. అలా ఎవరైనా అన్నారంటే వాళ్లు పిచ్చివాళ్లకిందే లెక్క. ఎందుకంటే సినిమా ఏ ఒక్కరి కష్టం కాదు. డైరెక్టర్, కెమెరామెన్ సహా ఎందరో టెక్నీషియన్లు నిబద్ధతతో పనిచేయాల్సి ఉంటుంది. అందరి కష్టమే సినిమా.

స్టైల్ మారుతుంది..?
హాలీవుడ్‌లో ఒక సినిమాలో హీరో మరో సినిమాలో విలన్‌గానూ కనిపిస్తాడు. ఇంకో సినిమాలో చిన్న పాత్రో, సపోర్టంగ్ క్యారెక్టరో చేసినా ఆశ్చర్యపోరు. భారతీయ చిత్రాల్లోనే ఆ ఫ్లెక్సిబిలిటీ కనిపించదు. కాని ఇప్పుడు మార్పు వస్తోంది. అందరూ పాత్ర పరిధి చూడకుండా వైవిధ్యాన్ని చూపించేందుకు ప్రయత్నిస్తున్నారు. అందులో నేను కూడా. 150 చిత్రాల్లో నటించిన నేను, ఆ అనుభవంతో భిన్నమైన పాత్రల్లో కనిపించగలగాలి. ఆ ఆలోచనతోనే ఉన్నా. నాతో ఎవరూ సినిమా చేయకపోతే, నేనే నిర్మాతగా, దర్శకుడిగా సినిమా చేసుకుంటాను. సినిమా మేకింగ్ స్టైల్ మారుతోంది.

రాజకీయాల్లోకి..
మంచి, చెడులను పక్కనపెడితే రాజకీయాల్లోకి రావాలంటే ముందు అవగాహన, ఆసక్తి ఉండాలి. నాకు రాజకీయాలపై అంత నాలెడ్జి లేదు. సినిమా పాపులార్టీ ఉంది కదాని రాజకీయాల్లోకి వచ్చేయాలనే ఆసక్తీ లేదు. మంచి చేయాలనుకుంటే -రాజకీయాల్లోకే ఎందుకు? ఉన్నరంగం నుంచీ చేయొచ్చు. నా గత చిత్రం జైహింద్-2 తెలుగు, తమిళం, కన్నడంలో విడుదల చేశాం. కన్నడంలో స్టేట్ అవార్డు వచ్చింది. ఎడ్యుకేషన్ సిస్టమ్‌పై సామాన్యుడి పోరాటమే ఆ చిత్రం. అలాంటి సినిమాలు చేయడం కూడా మంచి పరిణామమే. దేశభక్తి అంటే సరిహద్దుల్లో కాపలా కాయడమొక్కటే కాదు, దేశానికి ఉపయోగపడే మంచి పని ఏది చేసినా అది దేశభక్తే అవుతుంది. లేనివాడికి అన్నం పెట్టడం, ఇంటిని, పరిసరాల్ని శుభ్రంగా ఉంచుకోవడం వంటివన్నీ నా వరకూ దేశభక్తే.

మా అమ్మాయితో..
నా కుమార్తె ఐశ్వర్య ప్రధాన పాత్రలో కన్నడ సినిమా చేస్తున్నాను. షూటింగ్ అయిపోవచ్చింది. నా కూతురిని సినిమాలోకి తీసుకొచ్చేటప్పుడు చాలామంది ఎందుకు? అని సందేహం వ్యక్తం చేశారు. 35 ఏళ్లుగా నేనున్న పరిశ్రమని నేను నమ్మకపోతే ఎలా? ప్రతిదానిలోనూ తప్పు, ఒప్పు అనేది ఉంటుంది. అది మనమీదే ఆధారపడి ఉంటుంది.

తదుపరి చిత్రాలు..
అల్లు అర్జున్ సినిమాలో చేస్తున్నాను. దాంతోపాటు తమిళంలో రెండు సినిమాలు ఉన్నాయి.

-శ్రీ