ఇమేజ్‌ను అస్సలు నమ్మను

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చేసే ప్రతి సినిమాపై ఒకేలా దృష్టిపెడతాను. నావరకూ నాకు కొత్తగా అనిపించే పాత్రలే చేయాలనుకుంటున్నానని అంటోంది అందాల భామ తాప్సీ. తాజాగా తెలుగులో ‘ఆనందోబ్రహ్మ’లో నటించింది. మహి వి.రాఘవ్ దర్శకత్వంలో తెరకెక్కిన కామెడీ హారర్ ఎంటర్‌టైనర్ నేడు విడుదలవుతున్న సందర్భంగా హీరోయిన్ తాప్సీతో ఇంటర్వ్యూ..
* హర్రర్ సినిమాలంటే ఇష్టమా?
-అసలు హర్రర్ సినిమాలు చూడను. కానీ ఈ కానె్సప్టు నచ్చడంతో చేశా. ఇది పూర్తి స్థాయి హర్రర్ సినిమా కాదు. కామెడీ కలగలపు. నేను దేవుణ్ణి, దెయ్యాన్ని నమ్మను. కాని, సినిమాలో నవ్విస్తూ భయపెట్టే అంశాలు ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటాయి.
* మీ పాత్ర ఎలా వుంటుంది?
-అది చెబితే సినిమా చెప్పేసినట్టే. శ్రీనివాసరెడ్డి, వెనె్నల కిశోర్, తా.రమేష్.. వీళ్లందరితో పనిచేయడం ఫన్నీగావుంది. వీరందరికీ ఒక్కొక్క లోపముంటుంది. ఆ లోపాలే ఆయుధాలుగా ఏం చేశామన్నది తెరపై చూడండి.
* దర్శకుడి గురించి?
-మహి మంచి వ్యక్తి. సినిమాపై ఆయనకున్న పాషన్ బాగా నచ్చింది. ఏదైనా కొత్తగా చెప్పాలని చేసే ప్రయత్నంలో ముందుంటారు.
* బాలీవుడ్‌పైనే ఎక్కువ ఫోకస్సా..?
-తెలుగులో భిన్నమైన పాత్రలు చేయాలనుకున్నాను. కానీ అలాంటి పాత్రలు రాకపోవడంతో బాలీవుడ్‌లోకి వెళ్లాను. అక్కడ నచ్చే పాత్రలు దక్కుతున్నాయ..
* కథల విషయంలో ప్రాముఖ్యత?
- నా పాత్ర కొత్తగా వుండాలి. రొటీన్ పాత్రలు చేస్తే ప్రేక్షకులకే కాదు నాకూ బోరే..
* స్టార్ ఇమేజ్‌పై అభిప్రాయం?
-స్టార్ ఇమేజ్‌ని నమ్మను. ఇండస్ట్రీకి వచ్చిన కొత్తల్లో పెద్ద స్టార్ అవ్వాలి అనే కలలుండేవి. కానీ ఇక్కడ ప్రతిరోజూ కష్టపడాల్సిందే.
* పింక్, నామ్ శెబానా లాంటి సినిమాలేనా..?
-అలాంటివే కాదు, కమర్షియల్, మాస్ సినిమాలూ చేస్తాను. ప్రస్తుతం జుడ్వా-2 చేస్తున్నా. బాలీవుడ్‌లో వస్తున్న పక్కా కమర్షియల్ సినిమా ఇది. ఇందులో పూర్తి గ్లామరస్‌గా ఉంటా.
* మరి తెలుగులో..? కెరీర్ గురించి..?
- రెండు ప్రాజెక్టులు చర్చల దశలో ఉన్నాయి. ప్రస్తుతం చాలా ఆనందంగా ఉన్నాను. నేను ఏదైతే అనుకున్నానో అలాంటి భిన్నమైన పాత్రలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాను. ఇక పెళ్లి గురించి ఇప్పుడే ఆలోచించడంలేదు.

-శ్రీ