స్పైడర్.. పండగ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సూపర్‌స్టార్ మహేష్‌బాబు హీరోగా నటిస్తున్న ‘స్పైడర్’ సినిమా ఒక్క పాట మినహా షూటింగ్ పూర్తిచేసుకుంది. క్రేజీ దర్శకుడు మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలోని పాటను ఈనెల 23నుంచి రుమేనియాలో చిత్రీకరించనున్నారు. ఇప్పటికే భారీ అంచనాలు రేకెత్తించిన ఈ సినిమాతో మహేష్ కోలీవుడ్‌లోకి స్ట్రెయిట్ సినిమాతో ఎంట్రీ ఇవ్వనున్నారు. ఇప్పటికే ఆయన సినిమాలు డబ్బింగ్ రూపంలో తమిళ ప్రేక్షకుల్ని అలరించాయి. అక్కడ మహేష్ అంటే విపరీతమైన క్రేజ్ వుంది. ఈ నేపథ్యంలో కోలీవుడ్ ప్రేక్షకులకు మహేష్‌ను స్ట్రెయిట్ సినిమాతో పరిచయం చేయడానికి ఓ భారీ వేడుకను ఏర్పాటుచేయనున్నారు. ఈ వేడుక ద్వారా మహేష్‌తోపాటు చిత్ర యూనిట్ సభ్యులను తమిళ తెరకు పరిచయం చేయనున్నారట. మరోవైపు బిజినెస్ వర్గాల్లో సంచలనం రేకెత్తిస్తున్న ఈ సినిమా తమిళ హక్కులు కూడా భారీ రేటుకు అమ్ముడై మహేష్ స్టామినాను తెలిపింది. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో తెరకెక్కిస్తున్న స్పైడర్ చిత్రంలో రకుల్‌ప్రీత్‌సింగ్ హీరోయిన్‌గా నటిస్తోంది. దసరా సందర్భంగా సెప్టెంబర్ 27న చిత్రాన్ని విడుదల చేస్తున్నారు.