క్రిష్..రాయబారి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘గమ్యం‘, ‘వేదం’, ‘కంచె’ వంటి సినిమాలతో విభిన్నమైన దర్శకునిగా గుర్తింపు తెచ్చుకున్న క్రిష్ తన తదుపరి చిత్రానికి సన్నాహాలు మొదలుపెట్టాడు. మెగా హీరో వరుణ్‌తేజ్‌తో రూపొందించిన ‘కంచె’ చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకుని మంచి గుర్తింపు తెచ్చుకుంది. మళ్లీ వీరిద్దరి కాంబినేషన్‌లో తెరకెక్కిన చిత్రం మార్చిలో ప్రారంభం కానుంది.
ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులు చివరి దశకు చేరుకున్నాయి. ‘రాయబారి’ టైటిల్‌తో తెరకెక్కే ఈ చిత్రం స్కేయింగ్ బ్యాక్‌డ్రాప్‌లో ఓ భారీ యాక్షన్ సన్నివేశాలు వుంటాయని, దానికోసం జార్జియాలో లొకేషన్లు కూడా ఫైనల్ చేశారట. తెలుగు ప్రేక్షకులకు కొత్త అనుభూతినిచ్చే ఈ సన్నివేశం కోసం అరుదైన లొకేషన్లను ఎంపిక చేశారని తెలిసింది. ఈ చిత్రాన్ని రాజీవ్‌రెడ్డి నిర్మిస్తున్నాడు. వరుణ్ తేజ్ సరసన ఈ సినిమాలో కూడా ప్రగ్యా జైస్వాల్ నటించే అవకాశం వుంది. వీరిద్దరూ కలిసి కంచె చిత్రంలో నటించారు. మిగతా కార్యక్రమాలన్నీ పూర్తిచేసి త్వరలో షూటింగ్ ప్రారంభిస్తారట.