సాహో మొదలెట్టాడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాహుబలి సంచలన విజయం తరువాత ప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రం సాహో. రన్ రాజా రన్ ఫేం సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ చిత్రం ప్రస్తుతం యూరప్‌లో షూటింగ్ జరుపుకుంటోంది. గత కొన్ని రోజులుగా బాలీవుడ్ నటుడు నీల్ నితిన్ ముఖేష్‌కి సంబంధించిన సన్నివేశాల్ని చిత్రీకరిస్తున్నారు. తాజాగా శుక్రవారం నుంచి ప్రభాస్ షూటింగ్‌లో జాయిన్ అయ్యాడు. పూర్తిస్థాయి యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న చిత్రాన్ని యువి క్రియేషన్స్ బ్యానర్ అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది. ప్రభాస్ సరసన బాలీవుడ్ భామ శ్రద్ధాకపూర్ హీరోయిన్‌గా ఎంపిక చేశారు. తెలుగు, తమిళ, హిందీ, మలయాళ భాషల్లో విడుదలకానున్న సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.
బాలీవుడ్ సుందరాంగి శ్రద్ధాకపూర్ టాలీవుడ్ బాహుబలితో జత కట్టడం దాదాపు కన్ఫర్మ్ అయ్యింది. సుజిత్ దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తున్న సాహో చిత్రంలో హీరోయిన్‌గా శ్రద్ధాకపూర్ ఎంపికైన సంగతి తెలిసిందే. తెలుగు, తమిళ, హిందీ, మలయాళ భాషల్లో రూపొందుతోన్న చిత్రంలో పాలుపంచుకునే క్షణాల కోసం ఎప్పుడెప్పుడా అని ఉద్వేగంతో చూస్తున్నట్టు చెప్పుకొచ్చింది. సోషల్ మీడియాలో ఆనందం వ్యక్తం చేస్తూ, సాహోలో నేను నటిస్తున్నందుకే కాదు, తెలుగులో తొలి చిత్రమే ప్రభాస్‌తో చేస్తున్నందుకు ఆనందాన్ని తట్టుకోలేకపోతున్నా. ఉద్వేగానికి గురవుతున్నా అంటూ పెట్టింది. త్వరలో సెట్స్‌పైకి వెళ్లనున్న చిత్రంలో పలువురు ఇతర భాషా నటీనటులూ నటిస్తుండడం విశేషం. శ్రద్ధాకపూర్, ప్రభాస్‌ల జోడీ బాక్సాఫీస్‌ను ఎంతవరకు షేక్ చేస్తుందో చూడాలి.