ఆడియోకి జెఎల్‌కె

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఏకంగా మూడు పాత్రల్లో నటిస్తున్న ‘జై లవకుశ’ చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. దసరా సందర్భంగా చిత్రాన్ని విడుదల చేయడానికి యూనిట్ సన్నాహాలు చేస్తోంది. బాబి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రానికి సంబంధించిన టీజర్ ఇటీవలే విడుదలై దుమ్మురేపింది. ఎన్టీఆర్ త్రిపాత్రాభినయంలో ఒక పాత్ర నెగెటివ్ షేడ్‌లో కనిపించనుందన్నది తెలిసిందే. ఇప్పటికే జై, లవకుమార్‌లకు సంబంధించిన పోస్టర్లు, టీజర్లు బయటికొచ్చాయి. త్వరలోనే కుశాల్‌కు సంబంధించిన పోస్టర్‌నూ విడుదల చేయనున్నార్ట. మరోవైపు సెప్టెంబర్ మొదటివారంలో పాటలను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న చిత్రాన్ని ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్‌పై నందమూరి కళ్యాణ్‌రామ్ నిర్మిస్తున్నాడు. రాశిఖన్నా, నివేదా థామస్ హీరోయిన్లు.