సెన్సార్‌కు బెస్ట్ లవర్స్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకరణ్ ప్రొడక్షన్స్ పతాకంపై నంది వెంకటరెడ్డి దర్శకత్వంలో రూపొందించిన చిత్రం బెస్ట్ లవర్స్. గొంటి శ్రీకాంత్ నిర్మించిన ఈ చిత్రంలో శ్రీకరణ్, అమృత, ప్రీతి ప్రధాన తారాగణంగా నటించారు. షూటింగ్‌తో పాటుగా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తయిన ఈ చిత్రాన్ని సెన్సార్‌కు పంపిస్తున్నారు. ఈ సందర్భంగా నిర్మాత గొంటి శ్రీకాంత్ మాట్లాడుతూ ప్రేమకు సరికొత్త నిర్వచనం తెలిపే సినిమా ఇదని దర్శకుడు నంది వెంకట్ ఈ చిత్రాన్ని చక్కగా తెరకెక్కించారని తెలిపారు. ప్రేమలో వున్నవారు ఎవరైనా ఈ సినిమా చూడాల్సిందేనని, పాటలు సినిమాకు హైలెట్‌గా ఉంటాయని తెలిపారు. సెన్సార్ పూర్తయ్యాక అతి త్వరలో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తామని అన్నివర్గాల ప్రేక్షకులకు నచ్చే అంశాలతో రూపొందిన ఈ సినిమా తప్పక విజయవంతం అవుతుందని ఆయన తెలిపారు. చిత్రానికి సంగీతం జి.సాయికిరణ్, కెమెరా డి.యాదగిరి.