మెగా మహావీర్?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చిరంజీవి నటించే 151వ సినిమా ఈ మధ్యే ప్రారంభం అయిన విషయం తెలిసిందే. స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కథతో తెరకెక్కే సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుంది. చిరంజీవి పుట్టినరోజు కానుకగా 22న ఫస్ట్‌లుక్‌ను విడుదల చేయనున్నారు. ఈ సినిమాకు అంతర్జాతీయ సినిమాగా తీర్చిదిద్దేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అందరు అనుకున్నట్టు ఉయ్యాలవాడ కాదని ‘మహావీర్’ అనే టైటిల్ పెడుతున్నట్టు తెలుస్తోంది. మహావీర్ అనే టైటిల్ అయితే అన్ని భాషలకు కుదురుతుంది కాబట్టి ఇదే టైటిల్‌ను ఫిక్స్ చేయనున్నారు. సంగీత దర్శకుడుగా ఎఆర్ రెహమాన్‌ని పెట్టేందుకు చర్చలు జరుగుతున్నాయి. మరోవైపు సినిమాకు రాజవౌళి హ్యాండ్ కూడ తోడవుతుందట. బాహుబలి సినిమాతో అంతర్జాతీయ క్రేజ్ తేవడంతో రాజవౌళి సక్సెస్ అయిన నేపథ్యంలో ఈ సినిమాకు ఆయన హెల్ప్ తీసుకుంటున్నారట. సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కే ఈ సినిమా బ్రేక్ లేకుండా రెగ్యులర్ షూటింగ్ జరుగనుందట. వచ్చే సమ్మర్‌లో సినిమాను విడుదల చేయాలని చిరు ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. చరణ్ నిర్మిస్తున్న ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్లు వుంటారని, ఇప్పటికే నయనతార, ఐశ్వర్యరాయ్‌ల పేర్లు వినిపిస్తున్నాయి. మొత్తానికి మెగాస్టార్ నటించే ఈ సినిమా అంతర్జాతీయంగా భారీ హైప్‌తో రూపొందనుంది.