కెసిఆర్‌గా.... నవాజుద్దీన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు లైఫ్ హిస్టరీని సినిమాగా తెరకెక్కించే సన్నాహాలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ ప్రాజెక్టు అటు రాజకీయరంగంలో, ఇటు సినీవర్గాల్లో ఆసక్తి రేకెత్తిస్తోంది. రాజకీయనేతగా, ఉద్యమకర్తగా ఇమేజ్ తెచ్చుకున్న కెసిఆర్ కథను సినిమాగా తీయడం మామూలు విషయం కాదు, కత్తిమీద సామే. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ పూర్తికావడంతో, సినిమాను తెరకెక్కించేందుకు మధుర శ్రీ్ధర్ గొప్ప సాహసమే చేస్తున్నాడు. రాజ్ కందుకూరి నిర్మించే సినిమాలో బాలీవుడ్ నటుడు రాజ్‌కుమార్ రావు నటిస్తాడని అన్నారు. ఆయనతో చర్చలు కూడా జరిపారు. కానీ ఎందుకో ఇప్పుడు హీరో మారుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం కెసిఆర్ బయోపిక్‌లో బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్ధికి నటిస్తాడన్న టాక్ వినిపిస్తోంది. బాలీవుడ్‌లో విలక్షణ నటుడిగా ఇమేజ్ తెచ్చుకుంటున్న నవాజుద్దీన్ సిద్ధికి అయితే బాగుంటుందనే ఆలోచనలో ఉన్నారట దర్శక నిర్మాతలు. నవాజ్‌తో ఒక విడత చర్చలు జరిగాయని, చిత్రాన్ని బాలీవుడ్‌లోనూ విడుదల చేసే అవకాశం ఉండటంతో ప్రధాని పాత్ర విషయంలో స్ట్రాటజీని మార్చారనీ వినిపిస్తోంది. సర్ఫరోష్ సినిమాతో చిన్న పాత్రతో కెరీర్ ప్రారంభించాడు నవాజుద్దీన్ సిద్ధికి. ఎన్నో కష్టాలకు ఓర్చి నటుడిగా ఎదిగాడు. నవాజుద్దీన్ సిద్ధికితో కెసిఆర్ బయోపిక్ చేస్తే నిజంగా అది పెద్ద సంచలనమే.