నయన్.. హ్యాట్రిక్ రన్?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాలయ్య 152వ చిత్రానికి కెఎస్ రవికుమార్ దర్శకత్వం వహిస్తున్నాడు. సికె ఎంటర్‌టైన్‌మెంట్స్ ప్రై.లి. పతాకంపై నిర్మాత సి కల్యాణ్ భారీ చిత్రంగా దీన్ని రూపొందిస్తున్నాడు. ఈమధ్యనే ప్రారంభోత్సవం జరుపుకున్న చిత్రంలో, బాలయ్య సరసన నయనతారను కథానాయికగా ఎంపిక చేసిన విషయం తెలిసిందే. ప్రాజెక్టు రెగ్యులర్ షూటింగ్ మొదలవ్వడంతో, మంగళవారం నుంచీ ఆమె టీంలోకి చేరింది. మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న చిత్రం రెగ్యులర్ షెడ్యూల్ ప్రస్తుతం హైదరాబాద్‌లోని రామోజీ ఫిలింసిటీలో జరుగుతోంది. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత సి కల్యాణ్ మాట్లాడుతూ సింహ, శ్రీరామరాజ్యంలాంటి బ్లాక్‌బస్టర్ హిట్లు అనంతరం బాలకృష్ణ -నయనతార కాంబినేషన్‌లో వస్తున్న సినిమా ఇది. ఆ సినిమాల స్థాయిలోనే ఈ సినిమాలోనూ వారి మధ్య కెమిస్ట్రీ ఉండనుంది. బాలకృష్ణ కెరీర్‌లోనే ఇది మరో సంచలన చిత్రం అవుతుంది’ అన్నారు. బ్రహ్మానందం, ప్రకాష్‌రాజ్, అశుతోష్ రానా, మురళీమోహన్, బాహుబలి ప్రభాకర్ తదితరులు ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.