కేరళలో సర్దార్ గబ్బర్‌సింగ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రముఖ నటుడు పవన్‌కళ్యాణ్ హీరోగా నటిస్తోన్న సర్దార్ గబ్బర్‌సింగ్ చిత్రం షూటింగ్ 25 రోజులపాటు హైదరాబాద్‌లో జరుపుకునే విషయం తెలిసిందే. ఈ సినిమా కోసం వేసిన మార్కెట్ సెట్‌లో షూటింగ్ నిర్వహించారు. ప్రస్తుతం కేరళలో ఐదు రోజులపాటు షూటింగ్ ప్లాన్ చేశారు. ఈనెల 5 నుండి కేరళలో ఐదు రోజులపాటు ఏకధాటిగా షూటింగ్ నిర్వహిస్తారు. ఈ షెడ్యూల్‌లో హీరోయిన్ కాజల్ అగర్వాల్ పాల్గొననుంది. బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో లక్ష్మీరాయ్, సంజనలు ముఖ్యపాత్రల్లో కన్పించనున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలోని పాటలను మార్చిలో విడుదల చేస్తారట. చిత్రాన్ని ఏప్రిల్ చివరిలో విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు. నార్త్‌స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై శరత్‌మరార్‌తోపాటు పవన్‌కళ్యాణ్ నిర్మిస్తున్న చిత్రమిది.