యువ

శభాష్.. రాహుల్..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భారత సంతతికి చెందిన పనె్నండేళ్ల రాహుల్ దోషీ బ్రిటీష్ మీడియా సంస్థ ‘చానల్-4’ నిర్వహించిన ‘బాల మేధావి’ పోటీలో అందరినీ అబ్బురపరచి ‘ఔరా’ అనిపించుకున్నాడు. నాలుగు నుంచి పనె్నండేళ్ల వయసులోపు బాలలకు నిర్వహించిన పోటీలో మొత్తం ఇరవై మంది పాల్గొనగా, ప్రసిద్ధ శాస్తవ్రేత్తలు ఐన్‌స్టీన్, స్టీఫెన్ హాకింగ్‌ల కన్నా ‘ఐక్యూ’లో మెరుగైనవాడిగా రాహుల్ సత్తా చాటాడు. ‘చానల్-4’ నిర్వహించిన పోటీలో అన్ని ప్రశ్నలకు సరైన సమాధానాలు చెప్పి బాలమేధావిగా గుర్తింపు పొందాడు. కాగా, చివరి ప్రశ్నకు మాత్రం సమయం సరిపోకపోయినా, ఆంగ్ల పదాల స్పెల్లింగ్‌లు, ఉచ్చారణ తదితర విభాగాల్లో అన్నింటికీ చక్కగా జవాబులు చెప్పాడు. తుది పోటీలో తన ప్రత్యర్థి రోనన్ (9)ను 10-4 స్కోరుతో ఓడించి ‘బాల మేధావి’ పురస్కారాన్ని దక్కించుకున్నాడు. ఈ పోటీ సందర్భంగా ‘ఐక్యూ’ స్థాయి 162గా నమోదు చేసిన రాహుల్ ప్రపంచ ప్రసిద్ధి చెందిన శాస్తవ్రేత్తల సొసైటీ ‘మెన్సా’ క్లబ్‌లో సభ్యత్వం పొందే అవకాశం ఉంది. ఉత్తర లండన్‌లో స్థిరపడిన రాహుల్ తండ్రి మినేశ్ ఐటి సంస్థలో మేనేజర్‌గా, తల్లి ఫార్మాసిస్ట్‌గా పనిచేస్తున్నారు. గణితం, ఆంగ్లభాష, చరిత్ర, వైద్య విజ్ఞానం వంటి అంశాలను అమితంగా ఇష్టపడే తన కుమారుడు ఇంతటి ఘనతను సాధించినందుకు మినేశ్ దంపతులు ఆనందం వ్యక్తం చేశారు.