తమన్నా.. ఓ సెంటిమెంట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గ్లామర్ హీరోయిన్‌గా దక్షిణాదిలో మంచి పాపులారిటీ సంపాదించుకున్న తమన్నా ఓ వైపు హీరోయిన్‌గా నటిస్తూనే మరోవైపు ఐటెం సాంగ్స్ చేస్తూ ఆకట్టుకుంటోంది. ఇప్పటికే ఐటెం సాంగ్స్ కోసం భారీగా రెమ్యూనరేషన్ వసూలు చేస్తున్న ఈ భామ తాజాగా మరో యువ హీరోతో జోడీ కట్టనుంది. ‘అల్లుడు శీను’ చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా రూపొందే సినిమాలో తమన్నా హీరోయిన్‌గా నటించనుంది. ప్రముఖ దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కనుంది. ‘అల్లుడు శీను’ చిత్రంలో ఐటెం సాంగ్ చేసిన తమన్నా మరోసారి ‘స్పీడున్నోడు’ చిత్రంలో కూడా ఐటెం సాంగ్‌లో మెరిసింది. తమన్నాతో సాంగ్స్ చేయడంవల్ల ఆ సినిమాలకు బాగా ప్లస్ అవడంతో బెల్లంకొండ శ్రీనివాస్ తమన్నా సెంటిమెంట్‌గా మారిందట. అందుకే తన తదుపరి చిత్రంలో ఆమెనే హీరోయిన్‌గా ఎంచుకున్నాడు. భవిష్యత్తులో తమన్నా లేకుండా ఈ హీరో సినిమాలు చేయడేమో? బోయపాటి శ్రీను
దర్శకత్వంలో రూపొందే చిత్రం ఏప్రిల్‌లో సెట్స్‌పైకి రానుంది.