సిద్ధమైన కృష్ణాష్టమి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సునీల్ కథానాయకుడిగా వాసూ వర్మ దర్శకత్వంలో రాజు రూపొందించిన చిత్రం ‘కృష్ణాష్టమి’. ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకుని ఈనెల 19న విడుదలకు సిద్ధమైంది. ఈ సందర్భంగా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందించిన ఈ చిత్రంలోని పాటలు అందరినీ అలరిస్తున్నాయని, ఉన్నతమైన సాంకేతిక విలువలతో కుటుంబం మొత్తం చూడదగిన విధంగా రూపొందించామని తెలిపారు. సునీల్‌ను ప్రేక్షకులు ఎలా చూడాలనుకుంటున్నారో ఆ అంశాలతోపాటుగా క్లాస్, మాస్‌ని ఆకట్టుకునే అంశాలు ఈ చిత్రంలో వుంటాయని, అమెరికానుండి వచ్చిన ఒక కుర్రాడు భారతదేశంలో ఎటువంటి పరిస్థితులను ఎదుర్కొన్నాడు అనే కథనంతో ఈ చిత్రం సాగుతుందని దర్శకుడు వాసూవర్మ తెలిపారు. ఈ నెల 19న చిత్రం విడుదలకానున్నదని, అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చుతుందన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తంచేశారు. నిక్కీగల్రాణి, డింపుల్ చోప్‌డే, బ్రహ్మానందం, అశుతోష్ రాణా, ముఖేష్ రుషి, పోసాని కృష్ణమురళి, రాజన్ మోడి, సుమన్, సప్తగిరి, పవిత్రా లోకేష్, తులసి తదితరులు నటించిన ఈ చిత్రానికి కెమెరా:్ఛటా కె నాయుడు, ఎడిటింగ్:గౌతంరాజు, సంగీతం:దినేష్, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం:వాసూవర్మ.