స్పాట్ లైట్

దిక్కుతోచని చైనా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉత్తర కొరియా తన చెప్పుచేతల్లో ఉంటుందని, తాను చెప్పినమాట వింటుందని భావించిన చైనా కూడా ఇప్పుడు ఆ దేశ నాయకత్వ ధోరణి మింగుడుపడటం లేదు. సామ దాన భేద దండోపాయాలతో కొరియాను దారికి తెచ్చేందుకు అంతర్జాతీయంగా చేపడుతున్న చర్యలకు చైనా అనివార్య పరిస్థితుల్లో మద్దతిచ్చింది. కేవలం క్షిపణి పరీక్షలతో సరిపెట్టకుండా తాజాగా అణు పరీక్షను కూడా నిర్వహించి ఇటు అగ్రరాజ్యమైన అమెరికాకు, అంతర్జాతీయ శాంతికి పెనుసవాలు విసిరిన ఉత్తర కొరియాను ఏ విధంగా అదుపు చేయాలన్నది ఇప్పుడు చైనాకు అంతుపట్టడం లేదు. ముఖ్యంగా ఐదు దేశాల బ్రిక్స్ కూటమి శిఖరాగ్ర సదస్సు జరుగుతున్న సమయంలోనే ఉత్తర కొరియా ఈ అణు పరీక్ష నిర్వహించడం వెనుక అంతరార్థం ఏమిటన్నది కూడా అంతుబట్టడం లేదు. ఇప్పటికవరకూ ఎంత చెప్పినా ఉత్తర కొరియా దారికి రాకపోవడంతో చైనాకు అందుబాటులో ఉన్న అవకాశాలన్నీ మూసుకుపోయాయి.