టీజర్‌లో మీకు మీరే మాకు మేమే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తరుణ్‌శెట్టి, అవంతిక, కిరీటి ప్రధాన పాత్రల్లో హుస్సేన్ షా కిరణ్ దర్శకత్వంలో ప్లానెట్ గ్రీన్ స్టూడియోస్ పతాకంపై రూపొందుతున్న చిత్రం ‘మీకు మీరే మాకు మేమే’. ఈ సినిమా టీజర్ విడుదల కార్యక్రమం హైదరాబాద్‌లో జరిగింది. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో దర్శకుడు హుస్సేన్ షా కిరణ్ మాట్లాడుతూ, తామంతా ఇంజనీరింగ్ చదివి సినిమాల మీద పాషన్‌తో వచ్చామని, ముందుగా షార్ట్ ఫిలింస్ చేసి ఇప్పుడు ఫీచర్ ఫిలిం స్థాయికి ఎదిగామని అన్నారు. తెలుగు సినిమా క్లాసిక్ ‘మిస్సమ్మ’లోని ఓ సీన్‌ని ఇన్‌స్పైర్‌గా తీసుకుని దీనిని రూపొందించామన్నారు. చక్కటి ప్రేమకథతో ఉన్న ఈ సినిమాను ఆదరించి ఆశీర్వదించాలని కోరారు. వంశీ కార్తీక్ మాట్లాడుతూ, ఏడు సంవత్సరాలలో 45మంది కలిసి చేసిన ప్రయత్నమే ఈ చిత్రమన్నారు. తరుణ్‌శెట్టి మాట్లాడుతూ, ఈ సినిమాతో హీరోగా పరిచయం అవడం ఆనందంగా వుందన్నారు.