ఎన్టీఆర్ శ్రీనివాస కళ్యాణం?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జై లవకుశ చిత్రంతో ఎన్టీఆర్ బిజీగా ఉన్నాడు. ఈ చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది. ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం చేస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రం తరువాత ఎన్టీఆర్ త్రివిక్రమ్ దర్శకత్వంలో నటించేందుకు సిద్ధమవుతున్నాడు. ఈ చిత్రం పూర్తికాగానే ఎన్టీఆర్ మరో క్రేజీ ప్రాజెక్టుకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. త్రివిక్రమ్ దర్శకత్వంలో చిత్రం పూరె్తైన తరువాత స్టార్ ప్రొడ్యూసర్ దిల్‌రాజు నిర్మాణంలో ఎన్టీఆర్ నటించనున్నట్టు తెలుస్తోంది. ఈ చిత్రానికి అప్పుడే టైటిల్ కూడా ఫిక్స్ చేసినట్టు వార్తలు వస్తున్నాయి. విక్టరీ వెంకటేష్ సూపర్‌హిట్ చిత్రం శ్రీనివాస కళ్యాణం గుర్తుందా.. ఆ టైటిల్‌నే ఎన్టీఆర్ సినిమాకు అనుకుంటున్నట్టు వార్తలు వస్తున్నాయి. సాఫ్ట్ టైటిల్‌తో రానున్న ఈ చిత్రాన్ని కుటుంబ విలువలు, ఎమోషన్స్‌తో తెరకెక్కించనున్నట్లు సినిమా వర్గాలు చెబుతున్నాయి.