దుమ్మురేపనున్న తమన్నా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హీరోయిన్ల ఐటెం సాంగ్‌లంటే వద్దనేది ఎవరు? ఏ హీరోయిన్ అయినా సరే, తాను కథానాయికగా నటించిన చిత్రాలలో ఐదారు పాటల్లో నృత్యాలు చేసినా రాని క్రేజ్, ఒక్క చిత్రంలో ఐటెం పాటలో నటించిందీ అంటే ఆ పాటకు వున్న క్రేజ్ వేరు. ఎప్పుడెప్పుడు ఆ సినిమా విడుదలవుతుందా? ఎప్పుడెప్పుడు ఆ పాట చూడాలి అన్న కుతూహలం ఆయా హీరోయిన్ల అభిమానులను వెన్నాడుతూనే వుంటుంది. ఇప్పటికే తెలుగులో వున్న అగ్ర కథానాయికలందరూ ఐటెం పాటల్లో దుమ్ము లేపేశారు. ప్రస్తుతం ఎన్టీఆర్ కథానాయకుడిగా త్రిపాత్రాభినయంలో నటిస్తున్న ‘జైలవకుశ’ చిత్రంలో నటి తమన్నా ఐటెం పాటలో నటించింది. ‘స్వింగ్ జరా’ అనే పల్లవితో ఎత్తుకున్న ఈ పాటలో తమన్నా అద్భుతంగా డాన్స్ చేసిందని ప్రివ్యూ చూసినవాళ్లు చెబుతున్నారు. ఈ ఒక్క పాటలోనే తమన్నా తన ప్రతిభతోపాటు గ్లామర్‌ను కూడా పండించిందట. మామూలు పాటల్లోనే అదరగొట్టే తమన్నా, ఈ స్పెషల్ సాంగ్‌లో రెచ్చిపోయి నటించిందని తెలుస్తోంది. సో.. సినిమా విడుదలైతే కానీ దుమ్ము రేగదు.