యదార్థ సంఘటనలతోరంగు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తనీష్, పరచూరి రవీంద్రనాథ్, ప్రియాసింగ్ ప్రధాన తారాగణంగా యు ఎండ్ ఐ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై వి.కార్తికేయ దర్శకత్వంలో ఎ.పద్మనాభరెడ్డి, నల్ల అయ్యన్న నాయుడు, జి.ఎన్. రాజు సంయుక్తంగా రూపొందిస్తున్న చిత్రం రంగు. ఈ చిత్రానికి సంబంధించిన టీజర్‌ను ఇటీవల విడుదల చేయగా మంచి ఆదరణ పొందుతోంది. ఎనభై శాతం షూటింగ్ పూర్తి చేసి మిగతా షూటింగ్ శర వేగంగా జరుపుతున్నారు. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ విజయవాడలో జరిగిన యదార్ధ సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నామని చెప్పారు. ఈ కథలో నిజంగా వున్న వ్యక్తులే కొందరు తమ పాత్రల్లో నటిస్తుండడం విశేషమని ఎక్కడ కథ జరిగిందో అక్కడే చిత్రాన్ని రూపొందించడం మరో విశేషమని ఆయన అన్నారు. వైవిధ్యమైన చిత్రాలను ఇష్టపడేవారికి ఈ సినిమా తప్పక నచ్చుతుందని అన్ని వర్గాల ప్రేక్షకులకు కావాల్సిన ఎలిమెంట్స్‌ఈ చిత్రంలో వుంటాయని ఆయన అన్నారు. త్వరలో అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తామని ఆయన వివరించారు. షఫీ, పోసాని కృష్ణ మురళి, టార్జాన్ తదితరులు నటించిన ఈ చిత్రానికి కెమెరా సురేంద్రరెడ్డి, మాటలు: పరచూరి బ్రదర్స్, సంగీతం: యోగేశ్వర శర్మ, ఎడిటింగ్: బస్వ పైడిరెడ్డి, పాటలు: సిరివెనె్నల, శ్రీసాయికిరణ్. దర్శకత్వం: వి.కార్తికేయ.