గ్లామర్ రహస్యం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వయసు పెరిగే కొద్దీ గ్లామర్ మరింత పెరుగుతుందా అంటే దానికి సమాధానంగా నిలుస్తోంది మలైకా అరోరా. యాభై ఏళ్ల వయసుకు దగ్గర్లో వున్న ఈమెలో వీసమెత్తు గ్లామర్ కూడా తగ్గకపోవడంతో బాలీవుడ్ మీడియా పండితులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఎవరికీ చిక్కని ఆమె గ్లామర్ రహస్యం ఏమిటాని పరిశోధనలు చేస్తున్నారు. ఇప్పటికీ అద్భుతమైన ఫిజిక్‌తో హాట్‌హాట్ అందాలతో రెచ్చగొడుతున్న ఈ భామకు పదిహేనేళ్ల కొడుకున్నాడంటే ఎవరూ నమ్మరు. 98లో వచ్చి దిల్‌సే సినిమా నుంచి నిన్నమొన్న వచ్చిన ‘దబాంగ్-2’ వరకు ఆమె చేసిన ఐటమ్ సాంగులన్నీ కెవ్వుకేక అనిపించాయి. ఆమె వుంటే ఆ పాటకు గ్లామర్ వస్తుందని కుర్రకారు చెబుతున్నారు. అలాగే తన సొషల్ మీడియా ఎకౌంట్‌లలో కూడా గ్లామర్ పిక్‌ను పోస్టు చేస్తుంది. ఎప్పటికప్పుడు తాను అప్‌డేట్ అవుతున్నానని చెబుతోంది. ప్రస్తుతం బయట ఎక్కడా కనిపించకపోయినా తన ఐటమ్ పాటలతో అలరిస్తోంది.