ఔనా! నిజమేనా!!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉయ్యాల జంపాల చిత్రంతో ఒక్కసారిగా టాప్‌స్టార్‌గా ఎదిగిన అవికాగోర్ గుర్తుందా? చిన్నారి పెళ్లికూతురిగా టీవీ సీరియల్స్ చూసేవారిని అలరించిన అవికా గోర్ కథానాయికగా మారి నటించిన ఉయ్యాల జంపాల పెద్ద విజయం సాధించడంతో ఆమెకు పలు అవకాశాలు వెతుక్కుంటూ వచ్చాయి. అయితే ఆ తరువాత చేసిన సినిమాలు ఏవీ సరిగా ఆదరణ పొందకపోవడంతో అవికాగోర్ ఫేడౌట్ అయిందని ప్రచారం చేశారు. దీని వెనుక పెద్ద కుట్ర జరిగిందని అవికాగోర్ చెబుతోంది. ఒక్కసారిగా సింగిల్ నైట్‌లో ఎదిగిపోయిన తనను చూసి టాలీవుడ్‌లో కొందరు హీరోయిన్లు అసూయ చెందారని, ప్రత్యేకంగా తమకు తెలిసిన నిర్మాతలకు, దర్శకులకు ఫోన్లు చేసి నాకు అవకాశాలివ్వవద్దని చెప్పారని అభియోగం మోపుతోంది అవికా. దానికితోడు ఓ యంగ్ హీరో కూడా అవికాగోర్ గొడవపడింది. కారణం ఏదో తెలియదు కానీ మొత్తానికి అతను కూడా అవకాశాలు రాకుండా చేశాడని చెబుతోంది. ఏది ఏమైనా ఓ మంచి నటిని అసూయతో, అక్కసుతో టాలీవుడ్ నుండి వెళ్లగొట్టారని వాపోతోంది అవిక.