సాయమే చేస్తోంది!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కంగనా అంటేనే ఎదుటివాళ్లకు కంగారు పుట్టించే కారెక్టర్. ఎక్కడైనా సరే ఆమెదంటూ ఓ సపరేట్ ట్రాకే. మొదట్లో కెరీర్ ప్రారంభించినపుడు తాను అనుభవించిన కష్టాలు మరెవరికీ రాకూడదని బాహాటంగా స్టేట్‌మెంట్ ఇచ్చిన ముద్దుగుమ్మ, అవకాశం కోసం దేనికైనా సిద్ధం అని సవాలు చేసిన ధీరవనిత కూడా. అయితే అవకాశాలు వచ్చినవాటిని వచ్చినట్లుగా అద్భుతంగా వినియోగించుకుని ఉత్తమ నటిగా జాతీయ స్థాయిలో అనేక అవార్డులు, రివార్డులు అందుకుని తానేంటో నిరూపించుకుంది. ఇదంతా నాణేనికి ఒకవైపు. మరోవైపు హృతిక్ రోషన్, ఆదిత్య పంచోలితో చేసిన డేటింగ్ కబుర్లు. హృతిక్ రోషన్ భార్య, ఆదిత్య పంచోలి కళత్రం కంగనా దెబ్బకు భర్తలనే వదిలిపెట్టి వెళ్లిపోయారు. అయితే ఇప్పుడు కంగనా రనౌత్ చేస్తున్న వ్యాఖ్యానాలు విని మళ్లీ తమ ఇళ్లకు వచ్చేస్తున్నారట వారిద్దరూ. కంగనా రనౌత్ చేసిన తమ భర్తలపై చేస్తున్న వ్యతిరేక ప్రచారాన్ని చూసి తమ భర్తలకన్నా గొప్పవాళ్లు ఎవరూ లేరని వారిద్దరూ భావిస్తుండడమే ఇక్కడ అసలైన పాయింట్. ఇంతకూ తన మాజీ ప్రియులు హృతిక్ రోషన్, ఆదిత్య పంచోలిలకు నిజంగా కంగనా పంచ్‌లు వేసిందా? లేక వారి కుటుంబాలను సెట్‌రైట్ చేసిందా అనేది ఇక్కడ చర్చనీయాంశంగా మారింది. మొత్తానికి కథ సుఖాంతమైంది కనుక ఎవరికీ ఏం ఇబ్బంది లేదన్నమాట. ఏదేమైనా కంగన పేరు మీడియాలో మారుమ్రోగిపోయింది. ఆమెకు కావాల్సింది అదే మరి!