దీపావళికి రాజా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మాస్ మహారాజా రవితేజ కథానాయకుడిగా పటాస్, సుప్రీమ్ చిత్రాల ఫేమ్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘రాజా ది గ్రేట్’. హిట్ చిత్రాల నిర్మాత దిల్‌రాజు సమర్పణలో ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బేనర్‌పై శిరీష్ నిర్మాతగా ఈ చిత్రం నిర్మితమవుతోంది. చిత్రీకరణ పూర్తిచేసుకుని శరవేగంగా నిర్మాణానంతర కార్యక్రమాలను జరుపుకుంటోంది. సాయి కార్తీక్ సంగీత సారథ్యం వహించిన ఈ సినిమా టైటిల్ ట్రాక్ ఇటీవల విడుదలైంది. కాసర్ల శ్యామ్ ఈ పాటకు సాహిత్యాన్ని అందించారు.
‘రాజా రాజా ది గ్రేటు రా.. నువ్వు తళ తళ టూథౌజెండ్ నోటురా’ అంటూ సాగే పల్లవి ఎనర్జిటిక్‌గా ఉండటంతో పాటు హీరో క్యారెక్టరైజేషన్‌ను ఎలివేట్ చేసేలా ఉండటం బాగా ప్లస్ అయింది. మంచి ఊపున్న ఈ పాటకు ప్రేక్షకులనుండి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, టీజర్‌తోపాటుగా టైటిల్ ట్రాక్‌కు వస్తోన్న రెస్పాన్స్‌తో సినిమాపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. త్వరలోనే ఆడియో విడుదల చేసి అక్టోబర్‌లో సినిమాను విడుదల చేయడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా దర్శకుడు అనిల్ రావిపూడి మాట్లాడుతూ- సినిమా ఔట్‌పుట్ బాగా వచ్చిందని, రవితేజ గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదని, డబుల్ ఎనర్జితో కష్టపడ్డారని తెలిపారు. ఇప్పటివరకు కనిపించని సరికొత్త పాత్రలో నటించారని, త్వరలోనే పాటలు విడుదల చేసి పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తిచేస్తామని అన్నారు. ఔట్ అండ్ అండ్ ఎంటర్‌టైనర్‌గా సినిమా అందరికీ నచ్చుతుందని ఆయన వివరించారు. ప్రకాష్‌రాజ్, రాధికా శరత్‌కుమార్, శ్రీనివాస్‌రెడ్డి తదితరులు నటించారు.