వైవిధ్యంగా గులాబీ మేడ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎల్.వి.క్రియేటివ్ ఎంటర్‌టన్‌మెంట్ పతాకంపై అల్లు వంశీ, అక్షర జంటగా బోండా వెంకటస్వామి నాయుడు దర్శకత్వంలో లెంకల అశోక్‌రెడ్డి రూపొందించిన చిత్రం ‘గులాబీ మేడ’. ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ పూర్తిచేసి పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుతున్నారు. చిత్రానికి సంబంధించిన ఆడియో విడుదల కార్యక్రమంలో బిగ్ సీడీని ప్రతాని రామకృష్ణగౌడ్, ఆడియో సీడీని నటి కవిత విడుదల చేశారు. ఈ సందర్భంగా దర్శకుడు వెంకటస్వామి నాయుడు మాట్లాడుతూ- లవ్, హారర్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో ఈ చిత్రాన్ని రూపొందించామని, కంటెంట్ వైవిధ్యంగా వుండేలా ప్రయత్నించామని, ప్రేక్షకులకు తప్పక నచ్చుతుందని తెలిపారు. చిన్న సినిమా అయినా పెద్ద సినిమాగా తీర్చిదిద్దామని, నల్లగండ జిల్లాలోని పలు ప్రాంతాలలో షూటింగ్ చేశామని, అక్టోబర్‌లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని నిర్మాత అశోక్‌రెడ్డి తెలిపారు. ఒక్కో పాట ఒక్కో కానె్సప్టుతో వుంటుందని సంగీత దర్శకుడు సాకేత్ నాయుడు అన్నారు.