తేజ దర్శకత్వంలో!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గురు తరువాత వెంకటేష్ నటించే సినిమా ఇంతవరకూ ఏదీ కన్‌ఫర్మ్ కాలేదు. ఆ సినిమా వచ్చి ఏడాది గడుస్తున్నా కూడా తదుపరి చిత్రం గురించి ప్రకటన రాకపోవడం విశేషం. ఇప్పటకే పలువురు దర్శకులతో కథా చర్చలు జరిపిన వెంకటేష్, ఆమధ్య పూరి జగన్నాధ్ చెప్పిన కథ కూడా విన్నాడు. కానీ ఆ సినిమా చేయడానికి ఆసక్తిగా లేడని తెలిసింది. తాజాగా, వెంకటేష్ తదుపరి చిత్రానికి ఓకె చెప్పినట్టు వార్తలొస్తున్నాయి. ఈ చిత్రం ఇటీవల ‘నేనే రాజు నేనే మంత్రి’ సినిమాతో మళ్లీ ఫామ్‌లోకి వచ్చిన తేజా దర్శకత్వంలో ఉంటుందట. ఇప్పటికే వీరిద్దరిమధ్య కథా చర్చలు జరిగాయని, కథ నచ్చడంతో వెంకటేష్ ఓకె చెప్పినట్టు తెలుస్తోంది. వెంకటేష్ తన కెరీర్‌లో ఎప్పుడూ సేఫ్ గేమ్ ఆడుతుంటాడు. పలు తమిళ హిట్ చిత్రాలను రీమేక్ చేసి విజయాలను అందుకున్న వెంకటేష్, సక్సెస్‌ఫుల్ దర్శకులతోనే సినిమాలు చేయడం పరిపాటి. ఆ కోవలో ఈసారి తేజాతో సినిమాకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చాడట.