యువతేజం టీజర్ లాంచ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీనివాసులు, శిల్ప, మేఘన ముఖ్యపాత్రల్లో శ్రీ వెంకటసాయి ఫిలిమ్స్ పతాకంపై ఎస్.శ్రీనివాసులు స్వీయ దర్శకత్వంలో రూపొందించిన చిత్రం ‘యువతేజం’. ఈ చిత్ర ట్రైలర్ ఆవిష్కరణ కార్యక్రమం శనివారం హైదరాబాద్‌లో జరిగింది. అనంతరం దర్శకుడు, హీరో శ్రీనివాసులు మాట్లాడుతూ ప్రస్తుతం గాంధీతత్వాన్ని, దేశభక్తిని మరిచిపోతున్నామని, అదే అంశంతో అందరికీ నచ్చేలా తెరకెక్కించిన సినిమా ఇదన్నారు. తాను పవన్‌కళ్యాణ్ అభిమానినని, ఆయన స్ఫూర్తితో ఈ సినిమా తీశారని, ఇది అన్ని రకాల కమర్షియల్ అంశాలతో తెరకెక్కిన చిత్రం అన్నారు. రాంబాబు మాట్లాడుతూ ఇదొక మంచి సందేశాత్మక చిత్రం అన్నారు. హీరోయిన్ శిల్ప మాట్లాడుతూ తాను ఇంతకుముందు ‘వేటపాలెం’ చిత్రంలో నటించానని, ఇది తన రెండవ చిత్రమని, తప్పకుండా తమ సినిమాను ఆదరిస్తారని కోరుకుంటున్నానన్నారు. ఈ చిత్రానికి సంగీతం: ఎ.ఆర్.సన్నీ, ఫొటోగ్రఫీ: యాదగిరి, ఎడిటింగ్: సర్దాజ్, నిర్మాత, దర్శకత్వం: ఎస్.శ్రీనివాసులు.