వరాలబాబు జీవితమే గరం దర్శకుడు మదన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కుటుంబ కథాచిత్రాల దర్శకుడిగా మంచి పేరుతెచ్చుకున్నాడు మదన్. ఆయన దర్శకత్వం వహిస్తున్న తాజా చిత్రం ‘గరం’. ఆది, ఆదాశర్మ జంటగా తెరకెక్కిన ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకుని, ఈనెల 12న విడుదలకు సిద్ధమైంది. ఈ సందర్భంగా దర్శకుడు మదన్ చెప్పిన విశేషాలు.
కథ గురించి?
చదువు సంధ్యలు లేని ఓ పల్లెటూరి యువకుడు వరాలబాబు జీవితంలో చోటుచేసుకున్న సరదా సంఘటనలే ఈ చిత్రం. ప్రేమతోపాటు అతడి లక్ష్యాన్ని ఎలా చేరుకున్నాడనేదే కథ.
‘గరం’ అంటే ఏంటి?
ఇది హీరోలో వున్న ఎనర్జీకి సంబంధించి పెట్టాం. పక్కా మాస్ అంశాలతో రూపొందే ఈ కథలో ప్రేమ, కుటుంబ విలువలు, వినోదం అన్నీ కలిపి రూపొందించాం.
కథలో ఏం నచ్చి సినిమా చేశారు?
2012లో శ్రీనివాస్ ఈ కథను వినిపించాడు. అందులోని పాయింట్ బాగా నచ్చింది. ముఖ్యంగా స్క్రీన్‌ప్లే బేస్డ్‌గా సాగే సినిమా ఇది. చచ్చేదాకా సవాలక్ష సమస్యలు వుంటాయి. వాటికోసం ప్రేమించడం మానేయాల్సిన అవసరం లేదనే కుర్రాడి కథ. అతని నమ్మకమే ఈ సినిమాను నిలబెడుతుంది.
హీరోగా ఆది గురించి?
ఆది ఈ కథకు సరిగ్గా సరిపోయాడు. ముఖ్యంగా డాన్సులు, అతని నటన ప్రత్యేకంగా ఆకట్టుకుంటాయి. ఈ సినిమాలోని పాత్రలో ఇమిడిపోయి నటించాడు.
మధ్యలో చాలా గ్యాప్ ఏర్పడటానికి కారణం?
‘ప్రవరాఖ్యుడు’ సినిమా తర్వాత నా జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలతో పరిశ్రమను వదిలిపోయాను. తర్వాత వేరే బిజినెస్‌లు చేసి అక్కడ చేతులు కాల్చుకున్నాను. ఫైనల్‌గా మనకు తెలిసింది సినిమా తీయడమే అని మళ్లీ వచ్చాను. ఈ సినిమా కూడా ఏడాదిన్నర క్రితమే ప్రారంభమైంది. కొన్ని సమస్యలవల్ల ఇంతకాలం పట్టింది. ఓ ప్రమాదంలో నా ఆప్తమిత్రుణ్ణి కోల్పోయాను. ఆ బాధనుండి బయటపడడానికి చాలా టైము పట్టింది.
తదుపరి చిత్రాలు?
ఈ సినిమా విడుదల తర్వాత లెక్కలు అవీ చూసుకుని, తదుపరి సినిమా ఏంటనేది ఆలోచిస్తా.

- శ్రీ