రాజశేఖర్ గరుడవేగ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉగ్రవాదం అంటే అభం శుభం తెలియని జనాల్ని చంపడమే కాదు, యువతను పెడదోవ పట్టించడం, పదిమందితో కలిసి ప్రజల్ని భయపెట్టడం, పరాయి దేశాలనుంచి మాదకద్రవ్యాలను తీసుకొచ్చి మన దేశంలో విక్రయించడం, మన దేశ సంపదను అక్కడికి తరలించడం వంటి కార్యకలపాలన్నీ ఉగ్రవాదంలో భాగమే. అటువంటి అతీతశక్తుల్ని సమాజం నుంచి బహిష్కరించడమే ఎన్‌ఐఏ (నేషనల్ ఇనె్వస్టిగేషన్ ఏజెన్సీ). ఇదే కథాంశంతో యాంగ్రీ యంగ్‌మెన్ రాజశేఖర్ కథానాయకుడిగా తెరకెక్కుతున్న చిత్రం ‘పిఎస్‌వి గరుడవేగ 126.18ఎం.’. నేషనల్ అవార్డు విన్నర్ ప్రవీణ్ సత్తారు దర్శకత్వం వహిస్తున్నారు. ఎం.కోటేశ్వరరాజు నిర్మాత. చిత్రీకరణ పూర్తయింది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇప్పటికే పోస్టర్ల రూపంలో విడుదల చేసిన క్యారెక్టర్లకు చక్కని స్పందన వచ్చిన విషయం తెలిసిందే. ఈ వారంలో టీజర్‌ను విడుదల చేయడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది.ఈ సందర్భంగా దర్శక నిర్మాతలు మాట్లాడుతూ నేషనల్ ఇనె్వస్టిగేషన్ ఏజెన్సీ నేపథ్యంలో సాగే యాక్షన్ థ్రిల్లర్ ఇది. బలమైన కథ, పాత్రకు ప్రాణం పెట్టి పనిచేసిన నటీనటులు, హైటెక్నికల్ వాల్యూస్‌తో రూపొందించిన ఈ చిత్రానికి ఇంటర్నేషనల్ టెక్నీషియన్లు కూడా పనిచేశారు. సెట్స్, స్టంట్, యాక్షన్ ఎలిమెంట్ దేనికదే ప్రత్యేకంగా వుంటుంది. కీలకమైన యాక్షన్ ఎపిసోడ్ల కోసం హెవీ క్రేన్స్, ఇండస్ట్రియల్ ట్రక్స్ ఉపయోగించాం. వృత్తినీ, వ్యక్తిగత జీవితాన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ కనిపించే వ్యక్తిగా రాజశేఖర్, ఆయన భార్యగా పూజాకుమార్ పాత్రలు ఆసక్తికరంగా వుంటాయి. జర్నలిస్టుగా శ్రద్ధాదాస్, ప్రత్యేకగీతంలో సన్నీలియోన్, ఇప్పటివరకు చెయ్యని పాత్రలో పృధ్వీ, రాజకీయ నాయకులుగా పోసాని, షాయాజీ షిండే, ఇతర పాత్రల్లో రవివర్మ, శత్రు, చరణ్‌దీప్, ఆదర్శ్ ఆకట్టుకుంటారు. ప్రి రిలీజ్ కార్యక్రమాలకు కూడా సిద్ధంగా ఉన్నాం. ఈ వారంలో టీజర్‌ని విడుదల చేస్తాం. అదేరోజు సినిమా విడుదల తేదీని వెల్లడిస్తాం అని తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా:అంజి, సురేష్ రగుతు, శ్యామ్‌ప్రసాద్, గికా, బాకుర్, సంగీతం:్భమ్స్ సిసిరోలియో, శ్రీచరణ్ పాకాల, ప్రొడ్యూసర్: ఎం.కోటేశ్వర్‌రాజు, కథ, కథనం, దర్శకత్వం:ప్రవీణ్ సత్తారు.