ఆస్కార్‌కు న్యూటన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భారతీయ చలనచిత్ర పరిశ్రమలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించే అంతర్జాతీయ అవార్డుల వేడుక ఆస్కార్ వేదికపైకి ఈ ఏడాది భారత్ నుండి పోటీపడడానికి బాలీవుడ్ చిత్రం ‘న్యూటన్’ ఎంపికైంది. రాజ్‌కుమార్‌రావ్ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రంలో దేశంలోని ఎన్నికల ప్రక్రియ పట్ల ఓ ఉద్యోగి తెచ్చిన మార్పు ఏంటి అన్న నేపథ్యంలో కథనాన్ని చర్చించారు. అమిత్ వి.ముసుర్కర్ దర్శకుడు. తాను నటించిన సినిమా ఆస్కార్ 2018 బరిలో నిలవడంపట్ల కథానాయకుడు రాజ్‌కుమార్ హర్షం వ్యక్తంచేశారు. ఆస్కార్ ఇండి యా జ్యూరీ చైర్మన్ సి.వి.రెడ్డితోపాటుగా సభ్యులు కలిసి దాదాపుగా 26 చిత్రాలను ఈ పోటీకై చూశా రు. తెలుగునుండి బాహుబలి-2, గౌతమిపుత్ర శాతకర్ణి చిత్రాలు కూడా పోటీపడ్డాయి. చివరికి బాలీవుడ్ సినిమా ‘న్యూటన్’ను ఆస్కార్ పోటీలో పాల్గొనడానికి ఎంపికైంది.