పోలీస్ పాత్రలో?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రస్తుతం ప్రభాస్ హీరోగా నటిస్తున్న ‘సాహో’ గురించి సర్వత్రా ఆసక్తి నెలకొంది. బాహుబలి తరువాత ఆయన నటిస్తున్న ఈ సినిమా భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతుండడంతోపాటు హైటెక్నికల్ విలువలతో రూపొందుతోంది. ప్రభాస్ సరసన హీరోయిన్‌గా బాలీవుడ్ భామ శ్రద్ధాకపూర్ నటిస్తున్న విషయం తెలిసిందే. శ్రద్ధాకపూర్ విషయంలో రోజురోజుకూ కొత్త కొత్త న్యూస్ హల్‌చల్ అవుతున్నాయి. ముఖ్యంగా మొదటిసారిగా సౌత్ సినిమాలో నటిస్తున్న శ్రద్ధాపై అందరి దృష్టి పడింది. ఇప్పటికే ఆమె ద్విపాత్రాభినయం చేస్తుందంటూ, మరోవైపు ఓ పాత్ర విలన్‌గా చేస్తుందని రకరకాలుగా వార్తలొచ్చాయి. తాజాగా శ్రద్ధా పోలీస్ పాత్రలో కనిపిస్తుందంటూ రూమర్స్ వస్తున్నాయి. ఈ విషయాన్ని శ్రద్ధ కన్‌ఫర్మ్ చేసిందట. దీనికోసం ఆమె ప్రత్యేక శిక్షణ కూడా తీసుకుంటుందని సమాచారం. మరి పోలీస్ పాత్రలో శ్రద్ధ ఎలా ఆకట్టుకుంటుందో చూడాలి!