యువి బ్యానర్‌లో ప్రభాస్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘బాహుబలి’ సినిమాతో దేశవ్యాప్తంగా స్టార్ ఇమేజ్‌ని సొంతం చేసుకున్న హీరో ప్రభాస్. ఈ సినిమాతో జాతీయస్థాయిలో గుర్తింపు రావడంతో పలు బ్రాండ్‌లకు అంబాసిడర్‌గా అవకాశాలు వస్తున్నాయి. ప్రస్తుతం ప్రభాస్ ‘బాహుబలి-2’ చిత్రం షూటింగ్‌లో బిజీగా వున్నాడు. ఈ ఏడాది మొత్తం ఈ సినిమాకే టైమ్ కేటాయించాడు. ఈ సినిమా తర్వాత ఆయన నటించే తదుపరి చిత్రానికి అప్పుడే సన్నాహాలు మొదలయ్యాయి. ప్రభాస్ తర్వాత చేసేందుకు రెండు సినిమాల్ని లైనులో పెట్టారు. కృష్ణంరాజు నిర్మించే చిత్రం ఒకటి కాగా, పలు హిట్ చిత్రాల్ని నిర్మిస్తున్న యువి క్రియేషన్స్ బ్యానర్‌లో మరో చిత్రంలో నటించనున్నాడు. సుజిత్ దర్శకత్వంలో రూపొందే ఈ సినిమాకు సంబంధించిన కథ కూడా ఓకే అయ్యింది. ఇప్పటికే ప్రభాస్ కథ విని గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చాడు. దాంతోపాటు శ్రీమంతుడు వంటి సంచలన చిత్రాన్ని రూపొందించిన మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌లో మరో చిత్రంలో నటించేందుకు కూడా ఓకే చెప్పాడని తెలిసింది. మొత్తానికి వచ్చే ఏడాది ప్రభాస్ మూడు సినిమాల్లో నటించేందుకు సిద్ధమయ్యాడు. త్వరలోనే ఈ సినిమాలకు సంబంధించిన వివరాలు వెల్లడికానున్నాయి.